ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: పశ్చిమ బెంగాల్‌ ఉద్యోగుల డీఏ 25% పెంచండి

ABN, Publish Date - May 17 , 2025 | 04:51 AM

పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ఉద్యోగులకు 25 శాతం కరవు భత్యం (డీఏ) చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • మూడు నెలల్లో అమలు చేయండి

  • రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, మే 16: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ఉద్యోగులకు 25 శాతం కరవు భత్యం (డీఏ) చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు నెలలో చేపడుతామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ఉద్యోగులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. డీఏ పెంచాలంటూ 2022 మే నెలలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.


దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022 నవంబరులో సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం డీఏను కొద్దికొద్దిగా పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 4ు పెంచడంతో మెత్తం డీఏ 18 శాతానికి పెరిగింది. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55 శాతం డీఏ వస్తోంది. తేడా 37 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే డీఏ పెంచాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - May 17 , 2025 | 04:51 AM