ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: వైద్య విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:08 AM

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన బి.జె.మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ ఇద్దరు డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

  • విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టుకు ఇద్దరు డాక్టర్లు

న్యూఢిల్లీ, జూన్‌ 14: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన బి.జె.మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరుతూ ఇద్దరు డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌కు లేఖ రాశారు. శిక్షణ పొందుతున్న ఆ వైద్యుల మృతి దేశానికి లోటని తెలిపారు.

అందువల్ల తక్షణ పరిహారం కింద మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. దీర్ఘకాలిక పరిహారం కింద కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిహారం చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కోరారు. తుదిపరిహారాన్ని నిర్ణయించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని విన్నవించారు.

Updated Date - Jun 15 , 2025 | 04:08 AM