Supreme Court Admits Plea on Income Cap: రిజర్వేషన్లలో ఆదాయ పరిమితిపై విచారణకు సుప్రీం ఓకే
ABN, Publish Date - Aug 12 , 2025 | 04:16 AM
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో చాలావరకు ఆయా వర్గాల్లో సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్నవారికే దక్కుతున్నాయని.
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో చాలావరకు ఆయా వర్గాల్లో సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్నవారికే దక్కుతున్నాయని.. అందువల్ల రిజర్వేషన్లలో అంతర్గతంగా ఆదాయ పరిమితి విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. రమాశంకర్ ప్రజాపతి, యమునా ప్రసాద్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు పరిశీలించింది. దేశంలో దశాబ్దాలుగా రిజర్వేషన్లను అమలు చేస్తున్నా... ఆయా కేటగిరీల్లోని కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందుతున్నారని, బాగా వెనుకబడినవారి పరిస్థితి ఏమాత్రం మారడం లేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఆయా కేటగిరీలలో అంతర్గతంగా ఆదాయ పరిమితిని అమలు చేస్తే ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా చర్య లు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం.. విచారణకు స్వీకరించింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై అక్టోబర్ 10లోపు స్పందించాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
Updated Date - Aug 12 , 2025 | 04:16 AM