Dwarka : జన్మాష్టమి కోసం గుజరాత్ ద్వారకలో ప్రత్యేక ఏర్పాట్లు
ABN, Publish Date - Aug 16 , 2025 | 06:48 AM
జన్మాష్టమి కోసం గుజరాత్‌లోని ద్వారక సర్వసన్నద్ధమైంది. ప్రత్యేక భద్రత, లాజిస్టికల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇ-రిక్షాలు వృద్ధులను, వికలాంగులను నేరుగా ఆలయ ద్వారం వద్దకు చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశభక్తి, భారతీయ సంస్కృతిపై విశ్వాసం పాదుగొలిపేలా..
ద్వారక (గుజరాత్), ఆగస్టు 16 : ఇవాళ అంగరంగ వైభవంగా జరుగుతోన్న జన్మాష్టమి కోసం గుజరాత్‌లోని ద్వారక సర్వసన్నద్ధమైంది. ప్రత్యేక భద్రత, లాజిస్టికల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీనియర్ సిటిజన్లు, వికలాంగ భక్తులు, తల్లులకు ప్రత్యేక సౌకర్యాలతో పాటు స్వచ్ఛమైన తాగునీరు మెరుగైన పారిశుధ్యం కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ద్వారక SDM లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) అమోల్ అవతే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 'జన్మాష్టమిని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంది. కీర్తి స్తంభం నుండి, అందరు భక్తులకు ఒకే చోట ప్రవేశం కల్పించారు.' అని అమోల్ వెల్లడించారు.
ఇంకా, 'ఇ-రిక్షాలు వృద్ధులను, వికలాంగులను నేరుగా ఆలయ ద్వారం వద్దకు చేర్చగలిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుండి సిబ్బంది.. దర్శనం కోసం వీరికి వీల్‌చైర్‌లలో సహాయం చేస్తున్నారు. తల్లుల కోసం, ఆలయం లోపల ఐదు శిశువులకు పాలిచ్చే కేంద్రాలను ఏర్పాటు చేశారు,' అని అవతే తెలిపారు. బాత్రూమ్‌లు, దేవాలయాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించినట్లు ఆయన తెలిపారు. 'హాథీ గేట్ నుండి సుదామ సేతు వరకు, అన్ని టాయిలెట్లు, బాత్రూమ్‌లు నిరంతరం పూర్తిగా శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 16 , 2025 | 06:51 AM