Raja Raghuvanshi Case: రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..
ABN, Publish Date - Jun 11 , 2025 | 11:34 AM
Raja Raghuvanshi Case: సోనమ్, రాజ్ కుశ్వాహ ప్రేమించుకుంటున్న సంగతి సోనమ్ తల్లికి తెలుసట. రాజాతో పెళ్లికి ముందే సోనమ్ తన తల్లికి రాజ్‌ను ప్రేమిస్తున్న విషయం చెప్పిందట.
రాజా రఘువంశీ కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సోనమ్, రాజ్ కుశ్వాహ ప్రేమించుకుంటున్న సంగతి సోనమ్ తల్లికి తెలుసట. రాజాతో పెళ్లికి ముందే సోనమ్ తన తల్లికి రాజ్‌ను ప్రేమిస్తున్న విషయం చెప్పిందట. పెళ్లి చేయమని అడిగిందట. అయితే, ఇందుకు సోనమ్ తల్లి ఒప్పుకోలేదట. ఈ విషయాలను రాజా అన్న విపిన్ వెల్లడించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘రాజ్‌ను ప్రేమిస్తున్న విషయాన్ని సోనమ్ తన తల్లికి ముందే చెప్పింది.
రాజాతో పెళ్లి తనకు ఇష్టం లేదని అంది. అయితే, రాజ్‌తో పెళ్లికి తల్లి ఒప్పుకోలేదు. తమ వర్గంలోని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీంతో రాజాతో పెళ్లికి సోనమ్ అయిష్టంగానే ఒప్పుకుంది. పెళ్లి తర్వాత చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ‘నువ్వే చూడు ఆ వ్యక్తిని ఏం చేస్తానో’ అని బెదిరించింది. ఆమె రాజాను చంపిస్తుందని ఎవ్వరమూ ఊహించలేదు’ అని విపిన్ అన్నట్లు తెలుస్తోంది. ఇక, సోనమ్ తన ప్రేమ విషయం తండ్రికి చెప్పలేదు. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది.
ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. తమ కింద పనిచేసే రాజ్‌ను ప్రేమిస్తున్నట్లు చెబితే తండ్రి పెళ్లికి ఒప్పుకోడని.. ఒత్తిడికి గురైతే ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని సోనమ్ భావించింది. రాజ్‌తో పెళ్లికి తండ్రిని ఒప్పించేందుకు రాజా మర్డర్ ప్లాన్ వేసింది. హత్య కోసం ముగ్గురు వ్యక్తులను మాట్లాడింది. వారికి ఏకంగా 20 లక్షల రూపాయలు ఇవ్వడానికి బేరం కుదిరింది. సోనమ్, రాజ్, మరో ముగ్గురు కలిసి.. పక్కా ప్లాన్‌తో రాజాను చంపేశారు. పాపం పండి చివరకు దొరికిపోయారు.
ఇవి కూడా చదవండి
పోలీసుల ముందే రాజ్ చంప పగులగొట్టాడు..
తిండి పెట్టిన మనిషిపై విశ్వాసం.. కడ వరకు అతడి వెంటే..
Updated Date - Jun 11 , 2025 | 11:35 AM