India Diplomacy: 33 దేశాల రాజధానులు 7 ప్రతినిధి బృందాలు
ABN, Publish Date - May 19 , 2025 | 04:57 AM
కేంద్రం ఏర్పాటుచేసిన ఏడు అఖిలపక్ష బృందాలు 33 దేశాల రాజధానులను పర్యటించి భారత కుతంత్రాలను ప్రాచుర్యం చేయబోతున్నాయి. ఈ బృందాల్లో రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు కలసి 59 మంది సభ్యులు ఉన్నారు.
ఉగ్రవాదంపై భారత వైఖరి వినిపించడానికి సిద్ధం
ఎన్డీయే నుంచి 31 మంది, ఇతర పార్టీల వారు 20 మంది
తెలంగాణ నుంచి ఒవైసీకి స్థానం
ఈ నెల 23 నుంచి పర్యటనలు
న్యూఢిల్లీ, మే 18: అంతర్జాతీయ వేదికపై పాక్ కుతంత్రాలను ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాలు 33 దేశాల రాజధానులను సందర్శించనున్నాయి. ఈ బృందాల్లో ఎన్డీయే నుంచి 31 మంది, ఇతర పార్టీలకు చెందిన 20 మందితోపాటు 8 మంది మాజీ దౌత్యవేత్తలు కలిపి మొత్తం 59మంది సభ్యులు ఉంటారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రధాన కార్యాలయాన్ని కూడా వీరు సందర్శిస్తారు. ఈ నెల 23 నుంచి ఈ బృందాల పర్యటనలు ప్రారంభంకానున్నాయి.
సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాలకు వెళ్లే మొదటి ప్రతినిధి బృందంలో బీజేపీ ఎంపీలు బైజయంత్ పాండా, నిశికాంత్ దూబే, ఫాంగ్నోన్ కొన్యాక్, రేఖా శర్మతోపాటు అసదుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం), సత్నామ్ సింగ్ సంధూ (నామినేటెడ్ ఎంపీ), గులాం నబీ ఆజాద్ (కేంద్ర మాజీ మంత్రి, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం), హర్ష్ శ్రింగ్లా (విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి) ఉంటారు.
యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్ దేశాలకు వెళ్లే రెండో బృందంలో బీజేపీ ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీ), సమిక్ భట్టాచార్యతోపాటు అమర్ సింగ్ (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన-యూబీటీ), గులాం అలీ ఖతానా (నామినేటెడ్ ఎంపీ), ఎంజే అక్బర్ (కేంద్ర మాజీ మంత్రి), పంకజ్ సరన్ (మాజీ దౌత్యవేత్త) ఉన్నారు.
ఇండోనేషియా, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లో పర్యటించే మూడో బృందంలో సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), అపరాజితా సారంగి, బ్రిజ్‌లాల్, ప్రధాన్ బారువా, హేమాంగ్ జోషి (బీజేపీ), యూసఫ్ పఠాన్ (టీఎంసీ), జాన్ బ్రిట్టాస్ (సీపీఎం), సల్మాన్ ఖుర్షీద్ (కాంగ్రెస్), మోహన్ కుమార్ (మాజీ దౌత్యవేత్త) ఉంటారు.
యూఏఈ, లైబీరియా, కాంగో, సిరియా, సియెర్రా లియోన్ దేశాలలో పర్యటించే నాలుగో బృందంలో శ్రీకాంత్ ఏక్‌నాథ్ శిందే (శివసేన), బాన్సురి స్వరాజ్, అతుల్ గార్గ్, మనన్ కుమార్ మిశ్రా(బీజేపీ), ఎస్‌ఎస్ అహ్లూవాలియా (బీజేపీ మాజీ ఎంపీ), సస్మిత్ పాత్ర (బీజేడీ), మహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), సుజన్ చినోయ్ (మాజీ దౌత్యవేత్త) ఉన్నారు.
అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలను సందర్శించే ఐదో బృందంలో శశిథరూర్ (కాంగ్రెస్), శాంభవి (ఎల్‌జేపీ- రామ్‌విలాస్), సర్ఫరాజ్ అహ్మద్ (జేఎంఎం), జీఎం హరీశ్ బాలయోగి (టీడీపీ), శశాంక్ మణి త్రిపాఠి, భువనేశ్వర్ కలితా, తేజస్వి సూర్య (బీజేపీ), మిలింద్ మురళీ దేవరా (శివసేన), తరణ్‌జీత్ సంధూ (మాజీ దౌత్యవేత్త) ఉంటారు.
స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాత్వియా, రష్యాల్లో పర్యటించే ఆరో బృందంలో కనిమొళి(డీఎంకే), రాజీవ్ రాయ్ (ఎస్‌పీ), మియాన్ అల్తాఫ్ అహ్మద్ (ఎన్‌సీ), బ్రిజేష్ చౌతా (బీజేపీ), ప్రేమ్‌చంద్ గుప్తా (ఆర్‌జేడీ), అశోక్ కుమార్ మిట్టల్ (ఏఏపీ), మంజీవ్ ఎస్ పూరీ (మాజీ దౌత్యవేత్త), జావేద్ అష్రాఫ్ (మాజీ దౌత్యవేత్త) ఉంటారు.
ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాలను సందర్శించే ఏడో ప్రతినిధి బృందంలో సుప్రియా సూలే (ఎన్‌సీపీ-ఎ్‌ససీపీ), రాజీవ్ ప్రతాప్ రూబీ,. అనురాగ్ సింగ్ ఠాకూర్, వి.మురళీధరన్ (బీజేపీ), విక్రమజీత్ సింగ్ సాహ్ని (ఏఏపీ), మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ(కాంగ్రెస్), లావు శ్రీకృష్ణదేవరాయులు (టీడీపీ), సయ్యద్ అక్బరుద్దీన్ (మాజీ దౌత్యవేత్త) ఉన్నారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 04:57 AM