Temperatures: కాలం కాని కాలంలో.. ఠారెత్తిస్తున్న ఎండలు..
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:20 AM
నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల్లో వరుణుడి కరుణతో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తరాది జిల్లాల్లో సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కపోత, చెమటతో బాధపడుతున్నారు.
చెన్నై: నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు అధికమవుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల్లో వరుణుడి కరుణతో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఉత్తరాది జిల్లాల్లో సూర్యుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కపోత, చెమటతో బాధపడుతున్నారు. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర మీదుగా ఉత్తరదిశగా కదలడంతో దక్షిణ, పడమటి గాలులు వ్యతిరేకదిశలో వీస్తుండటంతో రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరిగి 40 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు.
తిరుచ్చి(Tirucho)లో 39 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం పది గంటల నుంచే నగరవాసులు ఉక్కపోతకు గురయ్యారు. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నగరంలో వేడిగాలులు వీచాయి. వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. కూలీనాలీ చేసుకునే జనం ఈ ఎండవేడికి ఆపసోపాలు పడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష
Read Latest Telangana News and National News
Updated Date - Jul 30 , 2025 | 11:20 AM