ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: మోదీ విమానానికి సౌదీ జెట్‌ల ఎస్కార్ట్.. అరుదైన గౌరవం

ABN, Publish Date - Apr 22 , 2025 | 02:55 PM

సౌదీ అరేబియాతో చిరకాలంగా ఉన్న మైత్రీ బంధాన్ని సౌదీ పర్యటనకు ముందు ఒక ప్రకటనలో ప్రధానమంత్రి మోదీ గుర్తుచేసుకున్నారు. సౌదీ అరేబియాతో భారత్‌కు చిరకాల, చారిత్రక సంబంధాలున్నాయని, ఇటీవల కాలంలో ఈ సంబంధాలు మరింత ఊపందుకున్నాయని చెప్పారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండ్రోజుల అధికార పర్యటన కోసం మంగళవారం ఉదయం సౌదీ అరేబియా (Saudi Arabia) బయలుదేరారు. కౌన్స్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోదీ ఈ పర్యటన చేపట్టారు. నలభై ఏళ్ల తర్వాత సౌదీలో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. మోదీ రాక సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్‌రిండియా విమానం సౌదీ గగలతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్‌పోర్స్‌కు చెందిన ఎఫ్-15 ఫైజటర్ జెట్‌లు ఎస్కార్ట్‌గా నిలిచాయి. మోదీ విమానానాకి ఇరు వైపులా మూడోసి చొప్పు ఆరు జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి.

Jagdeep Dhankhar: దేశానికి పార్లమెంటే అత్యున్నతం..దీనికి అతీతంగా ఏదీ లేదు


సౌదీ అరేబియాతో చిరకాలంగా ఉన్న మైత్రీ బంధాన్ని సౌదీ పర్యటనకు ముందు ఒక ప్రకటనలో ప్రధానమంత్రి మోదీ గుర్తుచేసుకున్నారు. సౌదీ అరేబియాతో భారత్‌కు చిరకాల, చారిత్రక సంబంధాలున్నాయని, ఇటీవల కాలంలో ఈ సంబంధాలు మరింత ఊపందుకున్నాయని చెప్పారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ప్రజా సంబంధాలలో గణనీయమైన పురోగతిని సాధించాయని, వాటిని ముందుకు తీసుకువెళ్లడమే తన పర్యటన ఉద్దేశమని చెప్పారు. సౌదీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరచుకునేలా నిర్ణయాలు ఉంటాయని ట్వీట్ చేశారు.


మోదీ తన పర్యటన సందర్భంగా జెడ్డాలో నివసించే భారతీయులతో మఖాముఖీ సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రత, కనెక్టిటివీ ఇనేషియేటివ్స్‌తో సహా పలు అంశాలను సౌదీ ప్రిన్స్‌తో మోదీ చర్చిస్తారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించి పలు ఒప్పందాలు జరుగనున్నట్టు చెబుతున్నారు. బైలేటరల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ కౌన్సిల్ సమావేశానికి మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో కలిసి మోదీ అధ్యక్షత వహించనున్నారు.


Chennai: నిండు అసెంబ్లీలో.. సీఎం, మాజీసీఎంల మధ్య వాగ్వాదం

Ramdev Sherbet Jihad controversy: రామ్‌దేవ్ బాబా షర్బత్ జీహాద్ వ్యాఖ్యలు వివాదాస్పదం.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Updated Date - Apr 22 , 2025 | 03:13 PM