ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sanjay Raut: మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు!

ABN, Publish Date - Jul 12 , 2025 | 05:29 AM

శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఎక్స్‌లో శుక్రవారం పోస్టు చేసిన ఓ వీడియో మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది.

  • కరెన్సీ నోట్లతో నిండి ఉన్న బ్యాగ్‌

  • మహారాష్ట్రలో ఘటన

  • సోషల్‌ మీడియాలో వైరల్‌

  • మంత్రి శివసేన (శిందే) నేత

ముంబై, జూలై 11: శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఎక్స్‌లో శుక్రవారం పోస్టు చేసిన ఓ వీడియో మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది. మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి, శిందే వర్గం శివసేన నేత సంజయ్‌ శిర్సాట్‌ ఇంట్లోని ఓ బ్యాగులో కరెన్సీ నోట్ల కట్టలు ఉండడం, ఆ బ్యాగుకు కాస్త దూరంలో శిర్సాట్‌ కూడా ఉండడమే ఇందుకు కారణం. సంజయ్‌ రౌత్‌ పోస్టు చేసిన వీడియోలో ఏముందంటే.. మంత్రి సంజయ్‌ శిర్సాట్‌ ఓ గదిలో మంచంపై కూర్చోని సిగిరెట్‌ కాలుస్తుండగా.. ఆ మంచానికి కాస్త దూరంలో నోట్ల కట్టలతో నిండి ఉన్న ఓ బ్యాగు తెరిచి ఉన్నట్టు కనిపిస్తోంది.

శిర్సాట్‌తోపాటు ఆయన పెంపుడు శునకం కూడా గదిలో ఉంది. ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేసిన సంజయ్‌ రౌత్‌.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఈ వీడియో చూడాలని కోరారు. వీడియోపై సంజయ్‌ శిర్సాట్‌ కూడా స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తానేనని, తన ఇంటి పడక గదిలో కూర్చోని ఉన్నానని, పక్కన ఉంది తన పెంపుడు శునకమేనని తెలిపారు. అయితే, ఆ డబ్బుల సంగతి తనకు తెలియదన్నారు. నిజంగా తన దగ్గర అంత డబ్బు ఉంటే వాటిని దాచుకునేందుకు తన ఇంట్లో బీరువాలు ఉన్నాయని విమర్శలను తోసిపుచ్చారు. ఎవరో కావాలనే ఈ వీడియో తీసి తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాగా, 2019-24 మధ్యలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ సంజయ్‌ శిర్సాట్‌కు ఆదాయ పన్ను శాఖ గురువారమే నోటీసులు ఇవ్వడం గమనార్హం.

Updated Date - Jul 12 , 2025 | 05:29 AM