ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Samosa Health Warning: ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..

ABN, Publish Date - Jul 14 , 2025 | 05:09 PM

సమోసాలు, జిలేబీల విషయంలో ప్రజలను సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలతో అప్రమత్తం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. తొలుత నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు ఆ తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు క్రమంగా విస్తరించనున్నారు.

Samosa, Jalebi Health Warning

ఇంటర్నెట్ డెస్క్: అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హానికారక కొవ్వులు అధికంగా ఉండే సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్, చాయ్ బిస్కెట్ వంటి సంప్రదాయక ఆహారాలకూ సిగరెట్ ప్యాకెట్‌ తరహా హెచ్చరికలు జత చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఆహారాల స్టాల్స్ పక్కన హెచ్చరిక బోర్డులు, పోస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఆ తరువాత దశల వారీగా ఇతర నగరాలు, సంస్థలకు విస్తరించనున్నారు (Samosa, Jalebi Health Warning).

ఎందుకీ వార్నింగ్స్..

ప్రజారోగ్య సంక్షోభం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఊబకాయం, డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాగా వేయించిన ఆహార పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం, 2050 నాటికి భారత్‌లో అధిక బరువు, ఊబకాయం వ్యాధిగ్రస్తుల సంఖ్య 440 మిలియన్‌‌లకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో హానికారక ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం నడుం కట్టింది.

హెచ్చరికలు ఇలా..

మొదట నాగ్‌పూర్ ఎయిమ్స్‌‌తోపాటు ఇతర పాపులర్ ఫుడ్ స్టాల్స్ పక్కన ఈ హెచ్చరిక పోస్టర్లు, బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఫుడ్స్‌లో చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్‌ల వివరాలను స్పష్టంగా కనబడేలా పోస్టర్లల్లో పేర్కొంటారు. తరచూ ఈ ఫుడ్స్ తింటే కలిగే అనారోగ్యాల వివరాలను ప్రస్తావిస్తారు. సిగరెట్ ప్యాకెట్స్‌పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు.

ఇది సంప్రదాయక వంటకాలపై నిషేధం ఎంత మాత్రం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమోసాలు, జిలేబీలు వంటివి ఎప్పటిలాగానే ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే, తాము ఏ రకమైన ఆహారం తింటున్నదీ ప్రజలకు తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఉంటాయని తెలిపింది. ఈ ఆహారాలను పరిమిత స్థాయిలో తినాలన్న అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది.

మొదట నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టును ఆ తరువాత దశల వారీగా ఇతర నగరాలు, సంస్థలకు విస్తరించనున్నారు. సమతుల పోషకాహారం విషయంలో ప్రజలకు ఇది మేలుకొలుపు కాగలదని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సారే జహాసే అచ్ఛా.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫేర్‌వెల్ పార్టీలో శుభాంశూ శుక్లా సందేశం

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 09:13 PM