ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Air India: డ్రీమ్‌లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు: ఎయిరిండియా

ABN, Publish Date - Jun 14 , 2025 | 05:53 PM

బోయింగ్ 787 విమానాలు భారత్‌కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని, ఈ తనిఖీల్లో కొన్నింటికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాల రాకపోకల్లో జాప్యం జరగవచ్చని ఎయిరిండియా తెలిపింది.

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం అనంతరం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టినట్టు ఎయిరిండియా (Air India) తెలిపింది. డ్రీమ్‌లైనర్ విమానాల్లో విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ (DGCA) ఆదేశాల మేరకు వన్‌టైమ్ భద్రతా తనిఖీల కింద తొమ్మిది బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్లలో భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్టు పేర్కొంది. తక్కిన 24 విమానాల్లోనూ త్వరలోనే భద్రతా తనిఖీలు పూర్తి చేస్తామని తెలిపింది.

బోయింగ్ 787 విమానాలు భారత్‌కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని, ఈ తనిఖీల్లో కొన్నింటికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున సుదీర్ఘ ప్రయాణ మార్గాల్లో నడిచే విమానాల రాకపోకల్లో జాప్యం జరగవచ్చని ఎయిరిండియా తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రయాణిలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిరిండియా వద్ద ప్రస్తుతం 33 బోయింగ్ 787-8/9 విమానాలు ఉన్నాయి.

ఇవి కూాడా చదవండి...

సైప్రస్, కెనడా, క్రొయేషియాలో మోదీ పర్యటన

అయోధ్య ఆలయంలో రామదర్బార్ సందర్శన షురూ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 06:24 PM