Apple COO: యాపిల్ సీవోవోగా సబీ ఖాన్
ABN, Publish Date - Jul 10 , 2025 | 05:39 AM
భారత సంతతికి చెందిన సబీ ఖాన్ యాపిల్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, జూలై 9: భారత సంతతికి చెందిన సబీ ఖాన్ యాపిల్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో)గా నియమితులయ్యారు. జెఫ్ విలియమ్స్ స్థానంలో ఆయన ఈ నెలాఖరులోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సబీ ఖాన్ యాపిల్ కంపెనీలో 30ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. ఆయనకు పదేళ్ల వయస్సున్నప్పుడు కుటుంబంతో పాటు సింగపూర్‌కు వెళ్లిపోయారు. అక్కడే డిగ్రీ పూర్తి చేశారు. 1995లో యాపిల్ కంపెనీలో చేరారు.
Updated Date - Jul 10 , 2025 | 05:39 AM