Men Mental Health: బయటికి చెప్పుకోలేక చనిపోతున్నారు
ABN, Publish Date - May 19 , 2025 | 04:50 AM
పురుషుల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయపరమైన వెసులుబాట్లు లేకపోవడం కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సూచిస్తున్నారు.
నూఢిల్లీ, మే 18: పురుషుల్లో రోజురోజుకూ మానసిక సమస్యలు పెరుగుతున్నాయని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను సమాజంలో చెప్పుకొనే పరిస్థితులు లేకపోవడం, పరిస్థితులను ఎదుర్కోవడానికి న్యాయపరమైన వెసులుబాట్లు లేకపోవడంతో బాధితులు కుమిలిపోతున్నారని తెలిపారు. ఫలితంగా పురుషుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వివరించారు. 2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నవారిలో 72ు మంది పురుషులేనన్న ఎన్‌సీఆర్‌బీ నివేదికను వారు ఉటంకించారు. గృహ హింస కేసులు, లైంగిక వేధింపుల కేసులు, న్యాయపరమైన వేధింపులు, భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అసత్య ఆరోపణలు.. ఇలాంటి అంశాలు పురుషుల్లో ఎంతో మానసిక సంఘర్షణకు కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు తెలిపారు.
ఈ వ్యవహారాల్లో ఉపశమనం కోసం పురుషులకు తగిన న్యాయపరమైన వెసులుబాట్లు లేవని, దీనిపై వెంటనే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. హరియాణాలో ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వివాహితులైన పురుషుల్లో 52.4శాతం మంది తాము లింగ వివక్షను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ అధ్యయనాన్ని మానసిక వైద్య నిపుణులు ప్రస్తావించారు. పురుషుల మానసిక సమస్యలను చూసీచూడనట్లు వదిలివేయడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతోందని, న్యాయపరమైన సంస్కరణలు అవసరమని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ సైకాలజిస్ట్స్ జనరల్ సెక్రటరీ శ్వేతా శర్మ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 19 , 2025 | 04:50 AM