ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Advance Tipping: కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

ABN, Publish Date - Jun 02 , 2025 | 04:40 PM

అడ్వాన్స్ టిప్పింగ్‌పై కేంద్రం దృష్టి సారించడంతో క్యాబ్ బుకింగ్ యాప్స్ వెనక్కు తగ్గాయి. అడ్వాన్స్ టిప్పింగ్ ఆప్షన్ స్థానంలో వాలంటరీ టిప్, ఆప్షనల్ టిప్ వంటి వాటిని ప్రవేశపెట్టాయి.

Ride Hailing Apps Advance Tipping

ఇంటర్నెట్ డెస్క్: క్యాబ్ బుకింగ్ కోసం ముందస్తు టిప్ చెల్లించే విధానంపై రైడ్ హెయిలింగ్ యాప్స్ వెనక్కు తగ్గాయి. తమ యాప్స్‌లోని అడ్వాన్స్ టిప్ ఆప్షన్ స్థానంలో ‘ఐచ్ఛిక’, ‘స్వచ్ఛంద’ టిప్ ఆప్షన్‌లు ఉండేలా సంస్థలు యాప్‌లను అప్‌డేట్ చేస్తున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

‘ముందస్తు టిప్‌లు వసూలు చేస్తున్న క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్లపై కేంద్రం దృష్టి పెట్టింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ హెచ్చరిక తరువాత సంస్థలు తమ యాప్స్‌ను అప్‌డేట్ చేస్తున్నాయి. అడ్వాన్స్ టిప్ ఆప్షన్ స్థానంలో ‘వాలంటరీ టిప్స్’, ‘ఆప్షనల్ టిప్’ను చేరుస్తున్నాయి’ అని మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు. కంపెనీలు తమ యాప్స్‌ను అప్‌డేట్ చేస్తున్న నేపథ్యంలో వినియోగదారులు ఇకపై ముందస్తుగా డ్రైవర్లకు టిప్‌లు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. ముందస్తు టిప్‌లు ఇవ్వాలంటూ సంస్థలు వినియోగదారులను ఒత్తిడి చేయకూడదని తెలిపారు. టిప్ ఇవ్వాలా వద్దా అనేది కస్టమర్ల అభీష్టానీకే వదిలేయాలని స్పష్టం చేశారు.


కొన్ని యాప్స్‌లో కస్టమర్లు టిప్ ఆప్షన్‌ను స్కిప్ చేసే అవకాశం కూడా ఉందని మంత్రి పేర్కొన్నారు. మరికొన్ని యాప్స్‌లో అడ్వాన్స్ టిప్ ఆప్షన్ కనిపించకుండా మార్పులు జరుగుతున్నాయని అన్నారు. రైడ్ హెయిలింగ్ యాప్స్ తీరుతెన్నులను కేంద్రం మరికొంత కాలం పాటు నిశితంగా పరిశీలిస్తుందని కూడా మంత్రి హెచ్చరించారు. వినియోగదారుల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్నట్టు కనిపిస్తే బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.


ఇటీవల సీసీపీఏ రైడ్ హెయిలింగ్ యాప్స్‌కు అడ్వాన్స్ టిప్పింగ్ విషయంలో నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వేగవంతమైన సర్వీసు కోసం ముందస్తు టిప్ ఇచ్చేలా వినియోగదారులను బలవంతం చేయడం లేదా ఈ దిశగా ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలపై ఈ నోటీసులు జారీ చేసింది. వినియోగదారులను ముందస్తు టిప్ ఇవ్వాలంటూ బలవంతం చేయడం అనైతికమని మంత్రి జోషి కూడా అన్నారు. ఇలాంటి చర్యలను అనైతిక వాణిజ్య విధానాలుగా పరిగణిస్తామని చెప్పారు. సర్వీసు పూర్తయ్యాక చివర్లో వినియోగదారులు కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చేదే టిప్ అని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్‌కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 04:51 PM