ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ranthambore Incident: దేవుడా.. పులులున్న అడవిలో పర్యాటకులను వదిలి పారిపోయిన గైడ్

ABN, Publish Date - Aug 18 , 2025 | 09:15 AM

టైగర్ సఫారీపై అడవిలోకి వెళ్లిన టూరిస్టులను అక్కడే వదిలేసి వారి గైడ్ పారిపోయిన ఘటన రాజస్థాన్‌లోని రణ్‌థంభోర్ నేషనల్ పార్క్‌లో తాజాగా వెలుగు చూసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Ranthambore Safari Guide Flees

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌లోని రణ్‌థంబోర్ నేషనల్ పార్కులో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. టైగర్ సఫారీపై అడవిలోకి వెళ్లిన కొందరు టూరిస్టులను ఓ గైడ్ అక్కడే ఒంటరిగా వదిలేసి పారిపోయారు. దీంతో, రాత్రి వేళ దాదాపు గంటన్నర పాటు వారు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. పార్క్‌లోని జోన్ 6 ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, టైగర్ సఫారీపై బయలుదేరిన వాహనం సాయంత్రం 6 గంటల సమయంలో అడవి మధ్యలో నిలిచిపోయింది. ఆ సమయంలో వాహనంలో మహిళలు, చిన్నారులు సహా పలువురు టూరిస్టులు ఉన్నారు. అప్పటికే చీకటి పడసాగింది. ఆ ప్రాంతంలో సుమారు 60కి పైగా పులులు సంచరిస్తున్నాయి. దీంతో, టూరిస్టులు హడలిపోయారు.

ఇలాంటి సమయంలో వారితో తగాదాకు దిగిన గైడ్ ఆ తరువాత మరో వాహనం తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత అతడు తిరిగి రాలేదు. దీంతో, టూరిస్టులు ఏం చేయాలో తెలీక వణికిపోయారు. వాహనంలో పిల్లలు కూడా ఉండటంతో క్షణక్షణం ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏవైపు నుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందో అన్న భయంతో వారికి క్షణమొక యుగంలా గడిచింది. దాదాపు 90 నిమిషాల పాటు నరకం చూశారు. ఆ తరువాత మరో వాహనం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ కేఆర్ అనూప్ ఘాటుగా స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లు, గైడ్స్‌ను అస్సలు సహించమని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తాము పర్యాటకుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

బిహార్ ఓటర్‌ల జాబితా సవరణలపై అభ్యంతరాలు.. ఈసీ కీలక వ్యాఖ్యలు

పాక్ కోసం గూఢచర్యం.. జ్యోతి మల్హోత్రా కేసులో 2,500 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు

For More National News and Telugu News

Updated Date - Aug 18 , 2025 | 09:23 AM