ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra politics: మరాఠీ రాకపోతే చెంపదెబ్బలే రాజ్‌ ఠాక్రే

ABN, Publish Date - Jul 20 , 2025 | 06:22 AM

తమ రాష్ట్రంలో ఉంటూ మరాఠీ భాష రాని స్థానికేతరులకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే తాజాగా మరో వార్నింగ్‌ ఇచ్చారు...

ముంబై, జూలై 19: తమ రాష్ట్రంలో ఉంటూ మరాఠీ భాష రాని స్థానికేతరులకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే తాజాగా మరో వార్నింగ్‌ ఇచ్చారు. మరాఠీని అర్థం చేసుకోలేని వాళ్లకు గట్టి చెంపదెబ్బ తప్పదన్నారు. నేరుగా చెవిలో మాట్లాడినా మరాఠీని అర్థం చేసుకోలేకపోతే ఆ చెవి కిందే చెంప చెళ్లుమంటుందని ఆయన అన్నారు. ఇటీవల ముంబైలో మరాఠీ మాట్లాడని ఓ వ్యాపారస్తుడిపై తమ పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆయన సమర్థించారు. మీరా భయందర్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆ వ్యాపారస్తుడి వైఖరి కారణంగానే అతడిపై దాడి జరిగింది. మిగతా వ్యాపారస్తులు షాపులు మూసివేతకు పిలుపునిచ్చారు. ఎంత కాలం మూసి ఉంచుతారు? అసలు మేం కొనకపోతే వారి పరిస్థితి ఏంటి? ఇక్కడకు వచ్చిన మీరంతా బుద్ధిగా పనిచేసుకోండి. మూర్ఖంగా ప్రవర్తిస్తే చెంపదెబ్బ గ్యారంటీ’’ అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎంపైనా విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర స్కూళ్లలో 1-5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తే తమ పార్టీ ఆ స్కూళ్లను మూసివేస్తుందని హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తాడిపత్రిలో టెన్షన్‌ టెన్షన్‌

ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2025 | 06:22 AM