ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raja Raghuvanshi case: పోలీసుల ముందే రాజ్ చంప పగులగొట్టాడు..

ABN, Publish Date - Jun 11 , 2025 | 09:06 AM

Raja Raghuvanshi case: ఓ వ్యక్తి రాజ్‌ చంప పగులగొట్టాడు. పోలీసులు, మీడియా ముందు ఏ మాత్రం భయపడకుండా ఆ పని చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని ఏమీ అనలేదు. రాజ్‌ను మరింత భద్రంగా అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.

Raja Raghuvanshi case

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను మధ్య ప్రదేశ్, మేఘాలయ పోలీసులు సంయుక్తంగా విచారిస్తున్నారు. ఆ ఐదుగురు నిందితులు నిన్నటి వరకు మధ్య ప్రదేశ్‌లో ఉన్నారు. నిన్న రాత్రి మేఘాలయ పోలీసులు నిందితులను తీసుకెళ్లిపోయారు. రోడ్డు మీద నుంచి కాకుండా విమానం ద్వారా వారిని తరలించారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కుశ్వాహను ఇండోర్ ఎయిర్‌పోర్టు నుంచి మేఘాలయకు తీసుకువెళుతుండగా ఎయిర్‌పోర్టులో ఊహించని సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఓ వ్యక్తి రాజ్‌ చంప పగులగొట్టాడు. పోలీసులు, మీడియా ముందు ఏ మాత్రం భయపడకుండా ఆ పని చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని ఏమీ అనలేదు. రాజ్‌ను మరింత భద్రంగా అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. అతడు రాజ్‌ను ఎందుకు కొట్టాడన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘రాజ్ లాంటి వారికి అలాగే బుద్ధి చెప్పాలి. నేనైతే చావగొట్టే వాడ్ని’.. ‘ఆ ఐదుగురిని ఊరికే వదిలిపెట్టకూడదు. ఉరి తీయాలి’ అని కామెంట్లు చేస్తున్నారు.

4 లక్షలనుంచి 20 లక్షలకు సుఫారీ..

సోనమ్ తన భర్త రాజా రఘువంశిని చంపడానికి ముగ్గురు నిందితులకు మొదట 4 లక్షల రూపాయల సుఫారీ ఆఫర్ చేసింది. తర్వాత దాన్ని 20 లక్షల రూపాయలకు పెంచింది. మే 11వ తేదీన సోనమ్, రాజా వివాహం జరిగింది. కొన్ని రోజులకే నిందితులు రాజా హత్యకు ప్లాన్ చేశారు. మే 21వ తేదీన నవదంపతులు గువహటికి వెళ్లగా.. నలుగురు నిందితులు వారిని ఫాలో అయ్యారు. మే 22న రాజా, సోనమ్ షిల్లాంగ్‌కు వెళ్లారు. నిందితులు కూడా వారిని అనుసరించారు. ఆ మరుసటి రోజే రాజా హత్య జరిగింది.

ఇవి కూడా చదవండి

మనిషి అంత్యక్రియల్లో కోతి.. ఎలా బాధపడుతుందో చూడండి

6 ఏళ్ల కూతురిని వాటర్ టబ్బులో ముంచి..

Updated Date - Jun 11 , 2025 | 09:14 AM