ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: కులగణన ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి: రాహుల్

ABN, Publish Date - Apr 30 , 2025 | 08:31 PM

దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ స్వాగతించారు. బీహార్‌లో కులగణనకు తెలంగాణలో కులగణనకు తేడా ఉందని, తెలంగాణలో పారదర్శకంగా కులగణన జరిగిందని చెప్పారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కులగణన (Caste Census)కు కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్వాగతించారు. కులగణనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. అయితే ఎప్పట్లోగా కులగణన చేస్తారో చెప్పాలన్నారు.

Union Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు


''కులగణన చేపడతామని మేము పార్లమెంటులో చెప్పాం. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామని కూడా చెప్పాం. ఈ విషయాలపై ప్రధానమంత్రి మోదీ మూడు నాలుగు సందర్భాల్లో మాత్రమే మాట్లాడారు. 11 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా ఏమి జరిగిందో కానీ కులగణన చేపట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. మేము దీనికి పూర్తిగా మద్దతిస్తున్నాం. కానీ ఎప్పటిలోగా కులగణన చేపడతారో చెప్పాలని టైమ్ లైన్ అడుగుతున్నాం. బీహార్‌లో కులగణనకు తెలంగాణలో కులగణనకు తేడా ఉంది. తెలంగాణలో పారదర్శకంగా కులగణన జరిగింది'' అని రాహుల్ పేర్కొన్నారు.


కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

కులగణనకు సంబంధించి కేంద్ర మంత్రం బుధవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపడతామని ప్రకటించింది. క్యాబినెట్ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రాబోయే జనాభా లెక్కింపులో కులగణనను చేర్చాలని నిర్ణయించినట్టు చెప్పారు. తెలంగాణ, కర్ణాటకలో కులగణన జరగడాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ కోణం నుుంచి మాత్రమే ఇటువంటి సర్వేలు నిర్వహించాయన్నారు. ఇటువంటి సర్వేలు సందేహాలు సృష్టిస్తాయని, కానీ సర్వేలకు బదులుగా కుల గణనను జనాభా గణనలో చేర్చాల్సి ఉంటుందని చెప్పారు.


ఇవి కూడా చదవండి..

Classroom Scam: రూ.2,000 కోట్ల కుంభకోణం.. ఆప్ నేతలపై ఏసీబీ కేసు

Pahalgam Terror Attack: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

India Vs Pak: కవ్విస్తున్న పాక్.. యుద్ధం తప్పదా..

Updated Date - Apr 30 , 2025 | 08:34 PM