ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: పాక్‌కు ఊహించని దెబ్బ.. రహిమ్యార్ ఏయిర్‌బేస్ ధ్వంసం..

ABN, Publish Date - May 10 , 2025 | 02:02 PM

Operation Sindoor: పాకిస్తాన్ ప్రయోగిస్తున్న ఆయుధాలను భారత్ తన టెక్నాలజీతో ధ్వంసం చేస్తోంది. భారత్.. పాక్‌ను కోలుకోని దెబ్బ కొట్టేలా ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసి దాడులు చేస్తోంది.

Operation Sindoor

యుద్ధం వల్ల పాకిస్తాన్‌కు తేరుకోలేని దెబ్బ తగులుతోంది. పాక్ ఆర్థికంగా కోలుకోవడానికి ఇంకో 100 ఏళ్లు పడుతుంది కావచ్చు. అంతలా నష్టపోయింది. ఇంకా నష్టపోతుంది కూడా. భారత్ ఎంతో తెలివిగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తోంది. ఏయిర్‌బేస్‌లను టార్గెట్ చేసి ధ్వంసం చేస్తోంది. తాజాగా, దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన రహిమ్యార్ ఏయిర్‌బేస్‌ను భారత్ ధ్వంసం చేసింది. ఈ ఏయిర్‌బేస్ రాజస్తాన్ సరిహద్దు ప్రాంతానికి అతి దగ్గరలో ఉంది. మిలటరీ కార్యకలాపాలతో పాటు సివిల్ ఏవియేషన్‌కు కూడా పాక్ దీన్ని వాడుతోంది. చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ ఏయిర్‌బేస్, ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టును భారత్ ధ్వంసం చేసింది.


రహిమ్యార్ ఖాన్ ఏయిర్‌బేస్ చరిత్ర

పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ సెక్టార్‌లో రహిమ్యార్ ఖాన్ ఏయిర్‌బేస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మొదటి ప్రెసిడెంట్ షేక్ జాయెద్ బి్ సుల్తాన్ అల్ నహ్యాన్ విరాళంతో ఆ ఏయిర్‌పోర్టును నిర్మించారు. యూఈఏ నుంచి పాకిస్తాన్‌కు వచ్చే రాజ కుటుంబీకులు ఈ ఏయిర్‌పోర్టులోనే దిగుతూ ఉంటారు. ఇక్కడినుంచి షేక్ జాయద్ ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టుకు ప్రతీరోజూ విమానాలు తిరుగుతూ ఉంటాయి.


కీ పాయింట్స్..

  • 1966లో రహిమ్యార్ ఏయిర్‌బేస్‌ను నిర్మించారు.

  • 1990లో బోయింగ్ 737 విమానాలు తిరగడానికి వీలు ఉండేలా కొత్త రన్వేలను నిర్మించారు.

  • 1998లో ఏయిర్‌పోర్టులో సరైన వసతులు కల్పించటంలో భాగంగా .. కొత్త టెర్మినల్ ప్రారంభం అయింది.

  • 2003లో బోయింగ్ 747 విమానాల కోసం మరో సారి రన్‌వేను అప్‌గ్రేడ్ చేశారు.

  • 2009లో ఇంటర్‌నేషనల్ ఏయిర్‌పోర్టుగా గుర్తింపు పొందింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: భారత్, పాకిస్తాన్ యుద్ధంపై జాన్వీ ఎమోషనల్ పోస్ట్..

Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం అప్‌డేట్స్ మీ ఫోన్లో చూడాలనుకుంటే ఇలా చేయండి..

Updated Date - May 10 , 2025 | 02:03 PM