ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Manipur protests: సామూహిక ఆత్మాహుతి చేసుకుంటాం

ABN, Publish Date - Jun 09 , 2025 | 05:37 AM

యువకులు తమ తలలపై పెట్రోల్‌ చల్లుకుని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే కరణ్‌సింగ్‌ అదనపు ఎస్పీ మొయిరింగ్‌థమ్‌ అమిత్‌ ఇంటిపై దాడి చేసి, అతణ్ని అపహరించిన కేసులో నిందితుడు.

తమ నేత విడుదలకు మైతేయీ యువకుల డిమాండ్‌

ఇంఫాల్‌, జూన్‌ 8: భద్రతా బలగాలు, సీబీఐ అరెస్టు చేసిన అరంబాయ్‌ టెంగోల్‌(ఏటీ) నేత కరణ్‌ సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో సామూహికంగా ఆత్మాహుతి చేసుకుంటామంటూ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో మైతేయీ యువకులు ఆందోళన చేపట్టారు. శనివారం రాత్రి ఇంఫాల్‌లో రోడ్లపై టైర్లను తగులబెట్టి, రాస్తారోకో చేశారు. యువకులు తమ తలలపై పెట్రోల్‌ చల్లుకుని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే కరణ్‌సింగ్‌ అదనపు ఎస్పీ మొయిరింగ్‌థమ్‌ అమిత్‌ ఇంటిపై దాడి చేసి, అతణ్ని అపహరించిన కేసులో నిందితుడు. ప్రభుత్వం కరణ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడంతో.. అరంబాయ్‌ టెంగోల్‌లో చేరారు. కరణ్‌సింగ్‌ను తొలుత భద్రతాబలగాలు అరెస్టు చేయగా.. ఆ తర్వాత సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఇంఫాల్‌(తూర్పు), ఇంఫాల్‌(పశ్చిమం), బిష్ణుపూర్‌, థౌబల్‌, కాక్చింగ్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 05:37 AM