Professor Nikhita: అందరూ నన్నే తప్పుబట్టడం న్యాయమా..
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:52 AM
ఇంటి నుండి కాయగూరలు కొనటానికి, కారుకు పెట్రోలు వేయడానికి వెళ్లలేకపోతున్నానని, అందరూ తనను మాత్రమే తప్పుబట్టేలా ప్రవర్తిస్తున్నారని ప్రొఫెసర్ నిఖితా(Professor Nikhita) ఆరోపించారు. అజిత్‌కుమార్ లాకప్ డెత్ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు నిఖిత, ఆమె తల్లి శివకామిని రెండోసారి విచారణ జరిపారు.
- ప్రొఫెసర్ నిఖిత ఆగ్రహం
చెన్నై: ఇంటి నుండి కాయగూరలు కొనటానికి, కారుకు పెట్రోలు వేయడానికి వెళ్లలేకపోతున్నానని, అందరూ తనను మాత్రమే తప్పుబట్టేలా ప్రవర్తిస్తున్నారని ప్రొఫెసర్ నిఖితా(Professor Nikhita) ఆరోపించారు. అజిత్‌కుమార్ లాకప్ డెత్ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు నిఖిత, ఆమె తల్లి శివకామిని రెండోసారి విచారణ జరిపారు. విచారణ అనంతరం నిఖిత మీడియాతో మాట్లాడుతూ ఆలయ వాచ్‌మన్ అజిత్‌కుమార్‌పై తాను ఫిర్యాదు మాత్రమే చేశానని,
ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. పోలీస్ కస్టడీలో అజిత్‌కుమార్ మృతి చెందినట్లు తెలుసుకుని బాధపడ్డానని, అందరూ ఏకపక్షంగా తననే తప్పుబడుతుండగా ఇంటి నుండి బయటకెళ్ళి కాయగూరలు కొనేందుకు, పెట్రోలు వేసుకునేందుకు కూడా వెళ్లలేకపోతున్నానని, నిఖిత ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ లక్షదాటేసిన పసిడి ధరలు
ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లకు సమాన వేతనం
Read Latest Telangana News and National News
Updated Date - Jul 31 , 2025 | 11:52 AM