ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pregnant Woman: ఇంటి ఖర్చులకు డబ్బులు అడిగినందుకు గర్భిణిపై భర్త దారుణం..

ABN, Publish Date - Jun 01 , 2025 | 08:52 PM

Pregnant Woman: ఇంటి ఖర్చుల కోసం రేష్మకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. డబ్బులు అడిగితే దారుణంగా కొట్టేవాడు. తరచుగా ఆమెపై దాడి చేసేవాడు. కొన్ని రోజుల క్రితం కూడా రేష్మపై దాడి చేశాడు. ఈ సారి హద్దులు మీరి ప్రవర్తించాడు.

Pregnant Woman

21వ శతాబ్ధంలోనూ ఆడవాళ్ల మీద జరుగుతున్న దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్ర్యం విషయంలో ఇబ్బందులు తప్పటం లేదు. తాజాగా, ఇంటి ఖర్చులకు డబ్బులు అడిగినందుకు ఓ భర్త.. భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. గర్భిణి అని చూడకుండా భార్యను చావగొట్టాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కనౌజ్‌లో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తర ప్రదేశ్, కనౌజ్ జిల్లాకు చెందిన రేష్మకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో కొన్నేళ్ళ క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. రేష్మ ప్రస్తుతం గర్భంతో ఉంది. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత భర్త వికృత రూపం బయటపడింది. ఇంటి ఖర్చుల కోసం రేష్మకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. డబ్బులు అడిగితే దారుణంగా కొట్టేవాడు. తరచుగా ఆమెపై దాడి చేసేవాడు. కొన్ని రోజుల క్రితం కూడా రేష్మపై దాడి చేశాడు. ఈ సారి హద్దులు మీరి ప్రవర్తించాడు.


విచక్షణా రహితంగా కొట్టాడు. ఎవరికైనా ఈ విషయం చెబితే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. రేష్మ ఇంటినుంచి పారిపోయి బయటకు వచ్చింది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్తపై కేసు పెట్టిన తర్వాత రేష్మ ఆస్పత్రిలో చేరింది. చికిత్స అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ నా భర్త ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడు. నేను డబ్బులు అడిగినపుడు కొట్టేవాడు. ఈ సారి హద్దులు మీరి దారుణంగా కొట్టాడు’ అని తెలిపింది.


ఇవి కూడా చదవండి

తెలంగాణ లా, ప్రొస్ట్‌గ్రాడ్యుయేషన్ లా సెట్ అడ్మిట్ కార్డుల విడుదల..

మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Updated Date - Jun 01 , 2025 | 09:45 PM