PM Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Jun 06 , 2025 | 11:52 AM
The Chenab Railway Bridge: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని కట్టింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ బ్రిడ్జి గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఏమాత్రం చెక్కు చెదరదు.
జమ్మూకాశ్మీర్: భారతదేశం మరో అద్భుత కట్టడానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరిగింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జిగా పిలువబడుతున్న ఈ బ్రిడ్జి శుక్రవారం ఉదయం ప్రారంభం అయ్యింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఉధంపూర్.. శ్రీనగర్.. బారాముళ్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
ప్రధాని ప్రారంభించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇది ఈఫిల్ టవర్ కంటే చాలా ఎత్తైనది. ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లు మాత్రమే. కానీ, ఈ బ్రిడ్జి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు. కట్టింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఏమాత్రం చెక్కు చెదరదు. ఈ బ్రిడ్జిలో ఆసక్తికరమైన మరో ప్రత్యేకత ఏంటంటే.. ఆ బ్రిడ్జి బ్లాస్ట్ రెసిస్టంట్ స్టీలు, కాంక్రీట్‌తో తయారు అయ్యింది. బాంబు దాడులను సైతం బ్రిడ్జి తట్టుకుని నిలబడగలదు.
ఇవి కూడా చదవండి
ఘోర కారు ప్రమాదం.. నటుడు చాకో తండ్రి మృతి..
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్
Updated Date - Jun 06 , 2025 | 03:55 PM