PM Modi: ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రజలు ముందుకు రావాలి
ABN, Publish Date - May 27 , 2025 | 05:00 AM
ప్రధాని మోదీ ఉగ్రవాదంపై పాక్ ప్రజలను ముందుకు రావాలని పిలుపిచ్చి, తమ ప్రభుత్వం స్వార్థం కోసమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు హేనుకున్నారు. గుజరాత్ పర్యటనలో మోదీ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహాన్ని కల్పించాలని ప్రజలకు సూచించారు.
లేదంటే మా సైన్యం ఆగ్రహానికి గురికాక తప్పదు.. ఉగ్ర దాడి జరిగితే మోదీ మౌనంగా ఉంటాడా?
మా చెల్లెళ్ల బొట్టు చెరిపేవారిని అంతమొందించి తీరతాం: మోదీ
దాహోద్/భుజ్, మే 26: ఉగ్రవాదం అంతానికి పాక్ ప్రజలు ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. వారి ప్రభుత్వం, ఆర్మీ తమ స్వార్థం కోసమే టెర్రరిజానికి మద్దతిస్తున్నాయని తెలిపారు. శాంతిమార్గం ఎంచుకోకపోతే వారు భారత సైన్యం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధిలో భారత్ ముందంజలో ఉంటే.. దానిపై విద్వేషం పెంచడం.. కీడు చేయడమే పాకిస్థాన్ ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. పహల్గాంలో అమాయక టెర్రరిస్టులపై ఉగ్రవాదులు దాడిచేస్తే ఇండియా, మోదీ మౌనంగా ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. మన అక్కచెల్లెళ్ల నుదుట బొట్టు చెరిపే సాహసం ఎవరు చేసినా వారిని అంతం చేసి తీరతామని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ వచ్చిన ఆయన తొలిరోజు సోమవారం వడోదరాలో భారీ రోడ్‌షో నిర్వహించారు. కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. అనంతరం దాహోద్, భుజ్‌లో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని మాట్లాడారు. టెర్రరిజాన్ని పాక్ టూరిజంగా భావిస్తోందన్నారు. ఇది ప్రపంచానికే ప్రమాదమని చెప్పారు. ‘పాక్ ప్రజలను ఒకటి అడుగదలచుకున్నాను. ఇన్నేళ్లలో మీరు ఏం సాధించారు? ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినవారు మీ జీవితాలను నాశనం చేశారు. ఉగ్రవాదం మీ ప్రభుత్వానికి, సైన్యానికి సంపాదన మార్గం. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మీరే ముందుకు రావాలి’ అన్నారు. ఇదిలా ఉండగా, భారతీయ పండుగల సందర్భంగా విదేశాల్లో తయారైన టపాసులు, గణేశ ప్రతిమలు కొనడంపై ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి దిగుమతి వస్తువులను కొనడం ఆపాలని మీరు యోచించరా అని ప్రజలను ప్రశ్నించారు. దేశ ప్రగతి కోసం దేశీయంగా తయారయ్యేవాటినే కొంటామని అందరూ సంకల్పం తీసుకోవాలని పిలుపిచ్చారు. దాహో్‌సలో రూ.24 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
మహిళా సాధికారతకు మోదీ ఎంతో చేశారు: సోఫియా సోదరి
ఎయిర్‌పోర్టు నుంచి వైమానిక దళ కేంద్రం వరకు కిలోమీటరు వరకు మోదీ రోడ్‌షో సాగింది. కల్నల్ సోఫియా ఖురేషీ స్వస్థలం వడోదరా అన్న సంగతి తెలిసిందే. రోడ్‌షోకు ఆమె తల్లిదండ్రులు, కవల సోదరి షైనా ఖురేషీ, సోదరుడు మొహమ్మద్ సంజయ్ ఖురేషీ కూడా హాజరయ్యారు. షైనా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిని కలవడం సంతోషంగా ఉందన్నారు. మహిళల సాధికారతకు ఆయన ఎంతో చేశారని కొనియాడారు.
దేశంలో తొలి ‘బాహుబలి’ విద్యుత్ ఇంజన్‌కు పచ్చజెండా
సీమెన్స్ కంపెనీ నిర్మించిన దేశంలోనే అత్యంత శక్తివంతమైన 9000 హార్స్‌పవర్ విద్యుత్ రైలు ఇంజన్‌ను మోదీ సోమవారం ప్రారంభించారు. దేశంలో రైల్వే ద్వారా వస్తు రవాణాను ప్రస్తుతం ఉన్న 27ు నుంచి 45 శాతానికి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఇది కీలకంగా నిలుస్తుంది. దేశంలో ఇంత భారీ సామర్థ్యం గల విద్యుత్ లోకోమోటివ్‌ను తయారుచేయడం ఇదే ప్రథమం. రైల్వే శాఖ నుంచి ఇలాంటి 1200 లోకోమోటివ్‌ల డిజైన్, తయారీ, నిర్వహణకు సంబంధించి లభించిన ఆర్డర్‌కు అనుగుణంగా దహోడ్‌లోని ఫ్యాక్టరీలో సీమెన్స్ దీన్ని నిర్మించింది. గంటకి 120 కిటోమీటర్ల వేగంతో 5800 టన్నుల బరువును సునాయాసంగా తరలించగల సామర్థ్యం ఈ ఇంజన్‌కు ఉంది.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News
Updated Date - May 27 , 2025 | 05:58 AM