PM Modi interacts Shubhanshu Shukla: తొలి భారతీయుడు శుభాన్షుతో ప్రధాని మోదీ ముచ్చట
ABN, Publish Date - Jun 28 , 2025 | 07:52 PM
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించిన తొలి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో ప్రధాని మోదీ సంభాషించారు. తనను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా తీసుకువచ్చినది భారతీయ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలేనని శుభాన్షు ప్రధానితో అన్నారు.
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం (IAF) అధికారి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించిన తొలి భారతీయుడు శుభాన్షు శుక్లాతో ప్రధాని మోదీ సంభాషించారు. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తన అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఇది ఒక అద్భుతమైన సంభాషణ అని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరూ మాట్లాడుకున్న వీడియో ను ప్రధాని షేర్ చేశారు.
ఈ సందర్భంగా శుభాన్షు శుక్లా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. తన తోటి దేశస్థులకు హిందీలో సందేశం అందిస్తూ శుభాన్షు శుక్లా.. తన పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కురిపిస్తూ.. తనను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా తీసుకువచ్చింది భారతీయ ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలేనని ఈ సందర్భంగా ప్రధాని మోదీతో శుభాన్షు అన్నారు.
ఇవాళ (శనివారం, జూన్ 28) ఐఎస్‌ఎస్‌లో ఉన్న శుభాన్షు శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం కూడా ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. శుభాన్షు శుక్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారని, అక్కడ మిషన్ విజయవంతం కావాలని, భవిష్యత్‌లో శుభాన్షు శుక్లా మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షిచినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుభాన్షుతో మోదీ మాట్లాడుతున్న ఫోటోను షేర్ చేసింది పీఎం కార్యాలయం.
ఇవీ చదవండి:
మీ టోల్ ఖర్చులను ఇలా తగ్గించుకోండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 28 , 2025 | 08:06 PM