Coconut: కొబ్బరి ధరలకు రెక్కలు.. ఒకేరోజు క్వింటాపై రూ.3 వేల పెరుగుదల
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:09 PM
దక్షిణాదిన కొబ్బరి సాగు చేసే రాష్ట్రాల్లో కేరళతోపాటు కర్ణాటక కూడా కీలకమైనది. తుమకూరు, చిక్కమగళూరుతోపాటు పశ్చిమకనుమలకు అనుబంధమైన జిల్లాల్లో కొబ్బరితోటలు విరివిగా సాగు చేస్తారు.
బెంగళూరు: దక్షిణాదిన కొబ్బరి సాగు చేసే రాష్ట్రాల్లో కేరళ(Kerala)తోపాటు కర్ణాటక కూడా కీలకమైనది. తుమకూరు, చిక్కమగళూరు(Tumakuru, Chikkamaguluru)తోపాటు పశ్చిమకనుమలకు అనుబంధమైన జిల్లాల్లో కొబ్బరితోటలు విరివిగా సాగు చేస్తారు. గతంలో ఎన్నడూలేని విధంగా కొబ్బరిధరకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో కొబ్బరి విక్రయాల్లో ప్రధానమైన మార్కెట్ తిపటూరులో ఉంది.
క్వింటాల్ రూ.29,118 ధర పలికింది. కేవలం ఒక్కరోజులోనే క్వింటాల్‌కు రూ.3 వేలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. వారానికి రెండు రోజులపాటు కొబ్బరి మార్కెట్ తిపటూరులోని ఏపీఎంసీలో కొనసాగుతుంది. నిరంతరంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ ఏడాది పంట దెబ్బతింటుందని భావిస్తున్నారు. మరోవైపు ఉత్తరభారతంలో ఎండుకొబ్బరికి డిమాండ్ పెరిగింది. సోమవారం నాటి మార్కెట్‌కంటే గురువారం క్వింటాల్‌కు రూ.3వేలు పెరిగింది. రెండు నెలల్లో రూ.11వేల దాకా ధర పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు.
ఉత్తరభారత్‌లో కొబ్బరికి బాగా డిమాండ్ పెరిగింది. తమిళనాడు, కేరళలలో దిగుబడి తగ్గడమే ధర పెరిగేందుకు కారణమైనట్టు తెలుస్తోంది. మార్కెట్‌కు వచ్చిన కొబ్బరి తక్కువగానే ఉంది. గత ఏడాదితో పోలిస్తే జూన్‌లో మార్కెట్‌కు వచ్చిన కొబ్బరి భారీగా తగ్గినట్టు ఉంది. గురువారం 5,904 సంచులలో 2,538 క్వింటాళ్ల కొబ్బరి మార్కెట్‌కు వచ్చింది. మూడు రోజులక్రితం సోమవారం 7,795 సంచులలో 3,351 క్వింటాళ్ల కొబ్బరి వచ్చింది. ఇలా మార్కెట్‌కు తక్కువ కొబ్బరి రావడం, ఉత్తరభారతంలో డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం
ఆర్‌అండ్‌బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి
Read Latest Telangana News and National News