New Flats For MPs: ఎంపీల కొత్త ఇళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Aug 11 , 2025 | 12:28 PM
New Flats For MPs: ఎంపీల కోసం కొత్తగా నిర్మించిన 184 ఇళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గంలో ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీల కోసం కొత్తగా నిర్మించిన 184 ఇళ్లను సోమవారం ప్రారంభించారు. ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గంలో వీటిని నిర్మించారు. మొత్తం నాలుగు టవర్స్‌లో ఈ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఆ నాలుగు టవర్లకు క్రిష్ణ, గోదావరి, కోసి, హూగ్లీ నదుల పేర్లు పెట్టారు. ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ టవర్స్ పరిసర ప్రాంతంలో ఓ సిందూర మొక్కను నాటారు. ఇళ్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కూలీలతో ఆయన ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘పార్లమెంట్‌లో నా సహచరులైన వారి కోసం నిర్మించిన నివాస సముదాయాన్ని ప్రారంభించే అదృష్టం ఈ రోజు నాకు లభించింది. ఈ నాలుగు టవర్లకు భారతదేశంలోని నాలుగు మహానదులు కృష్ణా, గోదావరి, కోసి, హూగ్లీ పేర్లు పెట్టారు. కొంతమందికి ‘కోసి’ అనే పేరు పెట్టడం ఇబ్బందిగా అనిపించవచ్చు. వాళ్లు దానిని ఒక నదిగా కాకుండా, బీహార్ ఎన్నికల కోణంలో చూసే అవకాశముంది. కొత్త ఇళ్లలో మన ఎంపీలకు ఎలాంటి సమస్య ఉండదు.
వాళ్ల పని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ బహుళ అంతస్తుల సముదాయంలో 184 మంది ఎంపీలు కలిసి ఉండొచ్చు. నేను ముందుగానే చెప్పినట్లు.. కొన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు అద్దె భవనాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటి అద్దెలకే ప్రతీ ఏటా ప్రభుత్వానికి 1500 కోట్లు ఖర్చు అవుతోంది. ఎంపీల ఇంటి అద్దెకు కూడా భారీగానే ఖర్చు అవుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు మేము 350 ఎంపీల ఇళ్లను నిర్మించాము’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
వామ్మో.. నీతా అంబానీ కారు.. ఖరీదెంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..
ఢిల్లీ ఈసీ ఆఫీసుకి కదిలిన కూటమి ఎంపీలు.. అడ్డుకున్న పోలీసులు
Updated Date - Aug 11 , 2025 | 12:37 PM