ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ఖరారు

ABN, Publish Date - Jun 30 , 2025 | 09:40 PM

పర్యటనలో భాగంగా తొలుత జూలై 2 ,3 తేదీల్లో ఘనాలో ప్రధాని పర్యటిస్తారు. మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని ఒకరు పర్యటించడం ఇదే మొదటిసారి. వ్యవసాయం, వ్యాక్సిస్ డవలప్‌మెంట్, ఘనాలో వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు, రక్షణ రంగంలో సహకారం వంటివి ప్రధానంగా చర్చిస్తారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. జూలై 2 నుంచి ఎనిమిది రోజులపాటు ఆయన పర్యటన సాగుతుంది. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధానమంత్రి పర్యటిస్తారని కేంద్ర విదేశాంగలోని ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి (Dammu Ravi) తెలిపారు.

పర్యటనలో భాగంగా తొలుత ఘనాలో జూలై 2, 3 తేదీల్లో ప్రధాని పర్యటిస్తారు. మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో భారత ప్రధాని ఒకరు పర్యటించడం ఇదే మొదటిసారి. వ్యవసాయం, వ్యాక్సిస్ డెవలప్‌మెంట్, ఘనాలో వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు, రక్షణ రంగంలో సహకారం వంటివి ప్రధానంగా చర్చిస్తారు. అనంతరం ట్రినిడాడ్ అండ్ టొబాగాలో 3, 4 తేదీల్లో పర్యటిస్తారు. జూలై 4న అర్టెంటీనాకు వెళ్తారు. అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో విస్తృత చర్యలు జరుపుతారు. 5వ తేదీన నుంచి 8వ తేదీ వరకూ బ్రెజిల్‌లో పర్యటిస్తారు. రియోలో జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. 9న నమీబియా వెళ్లారు. ద్వైపాక్షిక చర్చలతో పాల్గొనడంతోపాటు పార్లమెంటులోనూ ప్రధాని ప్రసంగిస్తారు.

ఇవి కూడా చదవండి..

అనుష్కను కలుసుకున్న తేజ్ ప్రతాప్.. తనను ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్య

లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

For National News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 09:53 PM