BSF Arrests Pakistani National: భారత్‌లో అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థానీ అరెస్టు
ABN, Publish Date - May 05 , 2025 | 08:51 PM
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్థానీ యువకుడిని భారత దళాలు తాజాగా అదుపులోకి తీసుకున్నాయి. పంజాబ్ సరిహద్దుగా మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు నిందితుడు యత్నిస్తుండగా బీఎస్ఎఫ్ బృందానికి చిక్కాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ఓ పాకిస్థానీ యువకుడిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తాజాగా అరెస్టు చేసింది. మే 3 రాత్రి సమయంలో పాక్ యువకుడు హుస్‌నెయిన్ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా మీదుగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నించి భద్రతాదళాలకు దొరికిపోయాడు.
నిందితుడు పాక్‌లోని గుజ్రన్‌వాలా జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. సరిహద్దు వెంబడి పిల్లర్ నెం.63/ఎమ్ వద్ద ఫాల్కూ నాలా ప్రాంతంలో 250 మీటర్ల మేర భారత్ భూభాగంలోకి వచ్చిన సమయంలో అతడిని భద్రతాదళాలు గుర్తించాయి. ఈ ప్రాంతం బీఎస్ఎఫ్‌కు చెందిన సాహాపూర్ ఫార్వర్డ్ బోర్డర్ ఔట్‌పోస్టు పరిధిలోకి వస్తుంది. హెచ్‌ఐటీ పాయింట్ నెం.1 వద్ద ఉన్న సీటీ సందీప్ ఘోష్ ఆ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించి వెంటనే కంపెనీ కమాండర్‌కు సమాచారం అందించారు. వెంటనే క్విక్ రెస్పాన్స్ టీం అక్కడకు చేరుకుని ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. రాత్రి 11.45 సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దు, బీఎస్‌ఎఫ్ సరిహద్దు కంచె మధ్య ఉన్న పొదల్లో దాక్కున్న అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద 40 పాకిస్థానీ రూపాయలతో పాటు, పాక్ జాతీయ ఐడెంటిటీ కార్డును కూడా గుర్తించారు. అతడు 2000 ఆగస్టు 12న జన్మించినట్టు ఐడీ కార్డులో ఉంది. అతడిని అదుపులోకి తీసుకున్నాక బీఎస్ఎఫ్ సిబ్బంది పంజాబ్ పోలీసులకు అప్పగించారు. మే3న అదుపులోకి తీసుకున్నట్టు రికార్డుల్లో నమోదు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఈ విషయమై సమాచారం అందించారు. అతడిని ప్రస్తుతం భద్రతా దళాలు విచారిస్తున్నాయి. స్మగ్లింగ్, ఉగ్రవాదం, కుట్ర తదితర లక్ష్యాలతో నిందితుడు భారత్‌కు ప్రవేశించాడా అనే కోణంలో విచారిస్తున్నాయి.
ఈ చొరబాటు ఘటన నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు వద్ద గస్తీ పెంచాయి. నిందితుడి విషయంలో వేగంగా స్పందించిన బీఎస్ఎఫ్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా దళాలు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని ఈ ఉదంతం తెలుపుతోందని కామెంట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..
భారీ రోడ్డు ప్రమాదం.. ఇండియన్ ఐడల్ విన్నర్‌కు తీవ్ర గాయాలు
అత్యాధునిక రష్యా క్షిపణులను దిగుమతి చేసుకున్న భారత ఆర్మీ
For National News And Telugu News
Updated Date - May 05 , 2025 | 08:51 PM