Jammu: జమ్మూలో నెలకొన్న సాధారణ పరిస్థితి.. పాక్ మీడియా అసత్య ప్రచారం
ABN, Publish Date - May 09 , 2025 | 12:57 AM
ప్రస్తుతం జమ్ములో సాధారణ పరిస్థితి నెలకొంది. ప్రజలు ఇళ్లలో ఉన్నారు. అయితే పాకిస్తాన్ సోషల్ మీడియాలో మాత్రం అసత్య ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. జమ్మూలో పరిస్థితి భయానకగా ఉందని, ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్నారని పాకిస్తాన్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌లోనూ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాక్ తన అక్కసు వెళ్లగక్కేందుకు ఎంత చేయాలో అంతా చేస్తోంది. ఆ క్రమంలో జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్ దాడులకు దిగింది. జమ్ములోని ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్ దాడి చేసింది. అందుకు సంబంధించిన 8 పాక్ మిస్సైల్స్‌ను భారత్ కూల్చేసింది. దాదాపు ఎస్ 400 సిస్టమ్స్‌తో వాటిని భారత్ సైన్యం కూల్చివేసింది.
ప్రస్తుతం జమ్ములో సాధారణ పరిస్థితి నెలకొంది. ప్రజలు ఇళ్లలో ఉన్నారు. అయితే పాకిస్తాన్ సోషల్ మీడియాలో మాత్రం అసత్య ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. జమ్మూలో పరిస్థితి భయానకగా ఉందని, ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్లిపోతున్నారని పాకిస్తాన్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే జమ్ములో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్టు కూడా పాక్ మీడియా ప్రచారం చేసుకుంటోంది. పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చేయడంతో అక్కడ ఎలాంటి నష్టమూ సంభవించలేదు.
Updated Date - May 09 , 2025 | 12:57 AM