Pakistan pilot captured: పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ పైలెట్ దొరికాడా.. భారత సైన్యం అదుపులో ఉన్నాడా
ABN, Publish Date - May 09 , 2025 | 12:03 AM
భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాల పైనే దాడులకు పాల్పడితే.. పాకిస్తాన్ మాత్రం భారత్‌లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాల పైనే దాడులకు పాల్పడితే.. పాకిస్తాన్ మాత్రం భారత్‌లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లను, ఆత్మాహుతి డ్రోన్లను నిర్వీర్యం చేస్తోంది.
పాకిస్తాన్‌కు చెందిన ఫైటర్ జెట్ ఎఫ్-16ను భారత సైన్యం కూల్చేసిన సంగతి తెలిసిందే. పఠాన్ కోట్ సెక్టార్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఈ ఫైటర్ జెట్‌ను భారత సైన్యం కూల్చేసింది. ఆ సమయంలో ఆ ఫైటర్ జెట్ పైలెట్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఎనిమిది క్షిపణులతో పాకిస్తాన్ దాడికి తెగబడింది.
దాడికి దిగిన మొత్తం 8 క్షిపణులను భారత సైన్యం కూల్చేసింది. సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా సెక్టార్లను టార్గెట్‌గా చేసుకుని పాక్ క్షిపణి దాడులు చేసింది. ఆ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
Updated Date - May 09 , 2025 | 12:07 AM