ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు

ABN, Publish Date - May 09 , 2025 | 10:38 AM

Operation Sindoor: ఈ నేపథ్యంలోనే కరాచీ పోర్టుపై నావికాదళం దాడి చేసి, ధ్వంసం చేసింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. దూకుడు పెంచి లైన్ ఆఫ్ కంట్రోల్ పొడువునా దాడులకు పాల్పడింది.

India Pak Tensions

భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. నిన్న 15 చోట్ల సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. చైనా మిస్సైల్స్, డ్రోన్లతో రెచ్చిపోయింది. అయితే, భారత్ టెక్నాలజీ ముందు పాక్ ప్రయత్నాలు వీగిపోయాయి. ఆ మిస్సైల్స్, డోన్లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే కరాచీ పోర్టుపై నావికాదళం దాడి చేసి, ధ్వంసం చేసింది. పాక్‌లోని పలు ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది.


ప్రతీకార కాంక్షతో రగిలిపోతోంది. దూకుడు పెంచి లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా దాడులకు పాల్పడింది. మిలటరీ స్టేషన్లను ఇతర నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్లను ప్రయోగించింది. అయితే, భారత్ వాటిని సమర్ధవంతంగా ధ్వంసం చేసింది. ఇక, సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. చండీఘర్‌లో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ ఏరియల్ అటాక్స్‌కు పాల్పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు ఇంటిలోనే ఉండాలని, బయటకు రావద్దని స్థానిక అధికారులు ప్రజలకు విజ్ణప్తి చేశారు. బాల్కనీలకు దూరంగా ఉండాలని అన్నారు.


ముందస్తు చర్యల్లో ఇండియా

పాకిస్తాన్ దాడులకు పాల్పడుతున్న వేళ ఇండియా ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే 24 ఎయిర్‌పోర్టులను బంద్ చేసింది. ఛండీఘర్, శ్రీనగర్, అమృత్ సర్, లుధియానా, షిమ్లా, జోద్‌పూర్, జమ్మూ, పఠాన్‌కోట్ ఎయిర్‌పోర్టులను భారత విమానయాన శాఖ మూసేసింది. ఇక, పంజాబ్ ఆరు సరిహద్దు జిల్లాల్లోని అన్ని స్కూళ్లను మూసేసింది. శనివారం వరకు స్కూళ్లు బంద్‌లోనే ఉండనున్నాయి. రాజస్తాన్ కూడా స్కూళ్లతో పాటు కాలేజీలను మూసేసింది. ఢిల్లీలోని పలు స్కూళ్లు కూడా సెలవులు ప్రకటించాయి.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే పాక్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే..

India Pak Tensions: ఇండియా, పాక్ యుద్ధం.. అమెరికా ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

Updated Date - May 09 , 2025 | 11:23 AM