Pakistan airspace: పాక్ వల్ల నెలకి ₹307 కోట్లు నష్టం
ABN, Publish Date - Apr 30 , 2025 | 09:56 PM
పాకిస్తాన్ గగనతలం(ఎయిర్ స్పేస్) మూసివేత కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు ప్రతి నెలా ₹307 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సదరు విమాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు ..
Pakistan airspace: పహల్గాం దాడి అనంతరం దాయాది దేశం పాకిస్థాన్ పై భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం రద్దు సహా.. పలు రకాల ఆంక్షలు, బహిష్కరణలు చేసింది. అయితే, దీనికి బదులుగా పాకిస్థాన్ కూడా తన చేతిలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారత విమానాలు మా(పాక్) గగనతలంలో విహరించకూడదని ఆంక్ష పెట్టింది. ఫలితంగా భారత విమానయాన సంస్థలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
పాకిస్తాన్ గగనతలం(ఎయిర్ స్పేస్) మూసివేత కారణంగా భారతీయ విమానయాన సంస్థలకు ప్రతి నెలా ₹307 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. సదరు విమాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు నుంచి విమానాలు నడుపుతుండటం వల్ల అదనపు సమయం, ఇంధనం పడుతుంది. అంతేకాదు, ఢిల్లీ, ఉత్తర భారత నగరాల నుండి అంతర్జాతీయ విమానాలకు 1.5 గంటల వరకు అదనపు విమాన సమయం పడుతుంది.
ఉత్తర అమెరికాకు వెళ్లే విమానాలకు 16 గంటల విమాన ప్రయాణానికి అదనంగా గం.1.5 పడుతోంది. ఆ 1.5 అదనపు గంటల ఖర్చు దాదాపు ₹29 లక్షలు. ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలు అదనం. అదేవిధంగా, యూరప్‌కు 9 గంటల విమాన ప్రయాణానికి అదనపు విమాన సమయం దాదాపు 1.5 గంటలు అవుతుంది. దీని వలన విమానాన్ని నడిపే విమానయాన సంస్థకు దాదాపు ₹22.5 లక్షలు అదనంగా ఖర్చవుతుంది. మధ్యప్రాచ్యానికి విమానాలు నడపడానికి దాదాపు 45 నిమిషాల అదనపు సమయం పడుతుంది. ఫలితంగా వచ్చే అదనపు ఖర్చు దాదాపు ₹5 లక్షలు అవుతుంది.
Classroom Scam: రూ.2,000 కోట్ల కుంభకోణం.. ఆప్ నేతలపై ఏసీబీ కేసు
Pahalgam Terror Attack: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
India Vs Pak: కవ్విస్తున్న పాక్.. యుద్ధం తప్పదా..
Updated Date - Apr 30 , 2025 | 09:59 PM