ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India air strike Pakistan: మా ఎయిర్ బేస్ లను భారత్‌ దెబ్బతీసింది

ABN, Publish Date - May 18 , 2025 | 05:04 AM

ఆపరేషన్‌ సిందూర్‌లో భారత వాయుసేన చేసిన దాడులను పాకిస్థాన్‌ మొదటిసారిగా అధికారికంగా అంగీకరించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాక్‌ వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.

నూర్‌ఖాన్‌ వైమానిక స్థావరంపై దాడి చేసింది

తొలిసారి అంగీకరించిన దాయాది దేశం

దాడుల విషయం ఆర్మీచీఫ్‌ అర్ధరాత్రి తెలిపారు

ధ్రువీకరించిన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

న్యూఢిల్లీ, మే 17 : ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బ బలంగా తగిలిన విషయం ఎట్టకేలకు దాయాది దేశం అంగీకరించింది. తమ వైమానిక స్థావరాలపై భారత్‌ దాడులు జరిపిందని పాకిస్థాన్‌ తొలిసారి ఒప్పుకొంది. రావల్పిండిలోని నూర్‌ఖాన్‌ సహా పలు ప్రాంతాల్లోని ఎయిర్‌బే్‌సలపై ఈ దాడులు జరిగాయని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ స్వయంగా ధ్రువీకరించారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు, ఎయిర్‌బే్‌సలపై విరుచుకుపడిన విషయం తెలిసింది. తమ ఎయిర్‌బే్‌సలు లక్ష్యంగా దాడులు జరిగినట్టు ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున, 2.30 గంటలకు, ఆర్మీ చీఫ్‌ మునీర్‌ ఫోన్‌చేసి తనకు తెలిపారని షెహబాబ్‌ వివరించారు. ఆయన ప్రకటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోను అనుసరించి.. ప్రధాని షరీఫ్‌ శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. భారత క్షిపణులు తమ లక్ష్యాన్ని చేరుకున్నాయని ఆయన అంగీకరించారని పాకిస్థాన్‌కు చెందిన జియో న్యూస్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. భారత్‌ దాడులను ఎదుర్కొనేందుకు స్వదేశీ సాంకేతికతతోపాటు చైనా తయారీ జెట్లను వైమానిక దళం ఉపయోగించిందని తెలిపారు. కాగా, పాక్‌ ప్రధాని వ్యాఖ్యల వీడియోను బీజేపీ నేత అమిత్‌ మాలవీయా ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. ‘‘నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ సహా ఇతర స్థావరాలను భారత్‌ పేల్చివేసిందని స్వయంగా పాకిస్థాన్‌ అంగీకరించింది. పాక్‌లో బాగా లోపలకు చొచ్చుకెళ్లి మనం జరిపిన క్షిపణి దాడుల వార్తలతో అర్ధరాత్రి ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నిద్రలేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ విధ్వంస విస్తృతి ఏ స్థాయిలో ఉన్నదనేది ఇది తెలియజేస్తోంది’’ అని ఆయన తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 05:04 AM