ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mohan Bhagwat: రాక్షసత్వం ప్రబలితే.. పహల్గాం దాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ రియాక్షన్

ABN, Publish Date - Apr 27 , 2025 | 08:47 AM

పొరుగు దేశాలకు భారత్ ఎప్పుడూ హాని తలపెట్టలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, రాక్షసత్వం ప్రబలితే మాత్రం భారత్‌కు దీటుగా స్పందించడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదని అన్నారు.

Mohan Bhagwat on Pahalgam Attack

ఇంటర్నెట్ డెస్క్: పొరుగు దేశాలకు భారత్ ఎన్నడూ హాని తలపెట్టలేదని, అవమానించలేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, రాక్షసత్వం ప్రబలితే మాత్రం భారత్‌కు ప్రతిస్పందించడం మినహా మరో మార్గం ఉండదని స్పష్టం చేశారు. పహల్గాం దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మేము పొరుగు వారికి హాని తలపెట్టడం గానీ అవమానించడం గానీ చేయము. కానీ రాక్షసత్వం పెరిగితే మరో మార్గం ఉండదు కదా. పాలకుడి ప్రధాన కర్తవ్యం ప్రజల రక్షణే. పాలకుడు ఆ బాధ్యతను నిర్వహించాలి’’ అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

హిందూమతం మూల సూత్రాల్లో అహింసే ప్రధానమైనదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, స్వీయరక్షణ కోసం దుర్మార్గులను దీటుగా ఎదుర్కోవాలనేది కూడా హిందూ ధర్మంలో ఓ ప్రధాన అంశమని వివరించారు. దుర్మాగులకు గుణపాఠం చెప్పడం కూడా ఇందులో భాగమేనని అన్నారు.


మరో సందర్భంలో మోహన్ భగవత్ పహల్గాం దాడిపై స్పందిస్తూ.. అమాయకులను మతం అడిగి మరీ కాల్చి చంపారని అన్నారు. ‘‘హిందువులు ఇలాంటి పని ఎన్నడూ చేయరు. అది మన లక్షణమే కాదు. ద్వేషం, హింస మన సంస్కృతి కాదు. దీన్ని మౌనంగా భరించడం కూడా జరగదు’’ అని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సనాతన ధర్మంపై పూర్తి అవగాహన అవసరమని అన్నారు. ‘‘సత్యం, పవిత్రత, కరుణ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ మతానికి పునాదులు. ఇవి కాక మిగతావన్నీ అధర్మమే. అయితే, దురదృష్ట వశాత్తూ నేటి కాలంలో మతం అంటే ఆహారపు అలవాట్లు, కొన్ని కార్యక్రమాలకే పరిమితమైంది. ఉచ్ఛం, నీచం అనే భావనే హిందూ మత గ్రంథాల్లో లేదు. అస్పృశ్యత, వివక్ష ధర్మానికి వ్యతిరేకం. జాలి, కరుణ లేని ప్రవర్తన అధర్మం’’ అని ఆయన అన్నారు.

పహల్గాం దాడికి తామే బాధ్యులమని లష్కరే తయ్యబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తరువాత మాటమార్చిన ఉగ్ర సంస్థ. తమపై జరిగిన సైబర్ దాడి కారణంగా ఈ ప్రకటన వెలువడిందని చెప్పుకొచ్చింది. మరోవైపు, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను భద్రతా దళాలు ధ్వంసం చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

అదే జరిగితే సింధూ నదిలో వారి రక్తం పారుతుంది.. బిలావాల్ భుట్టో పిచ్చి కూతలు

అమెరికా కోసమే ఇదంతా.. ఉగ్రవాదంపై పాక్ రక్షణ శాఖ మంత్రి షాకింగ్ వ్యాఖ్య

పహల్గాం దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Read Latest and International News

Updated Date - Apr 27 , 2025 | 10:25 AM