ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: ప్రధానికి ధన్యవాదాలు చెప్పిన పహల్గాం బాధితురాలు

ABN, Publish Date - May 07 , 2025 | 08:35 AM

పాక్‌పై భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్‌ చేపట్టినందుకు పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. తమకు కొంత వరకూ సాంత్వన దక్కిందని పహల్గాం మృతుడు ఎన్ రామచంద్రన్ కుమార్తె ఆర్తీ మీనన్ మీడియాకు తెలిపారు.

Pahalgam Attack Victim’s Daughter on Operation Sindoor

ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌పై పహల్గాం బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమకు కొంతైనా న్యాయం దక్కిందని పలువురు బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన ఎన్ రామచంద్రన్‌ కుమార్తె ఆర్తీ మీనన్ ఆపరేషన్ సిందూర్‌పై స్పందించారు. ఈ దుఃఖ భరిత సమయంలో తమకు ఈ దాడులు కొంత స్వామత కలిగించాయని అన్నారు. ప్రధాని మోదీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. ‘‘మాకు జరిగిన నష్టం ఎన్నటికీ పూడదు. కానీ పాక్‌పై భారత్ తీసుకుంటున్న చర్యలు గర్వకారణం. ఈ చర్యలతో దేశం మరింత బలోపేతం అవుతుంది. ఈ సందర్భంగా చేతులు జోడించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నా’’ అరి ఆర్తీ అన్నారు.


బుధవారం అర్ధరాత్రి 1.44 సమయంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌ పేరిట పీఓకేతో పాటు పాక్‌లోని ఉగ్రస్థావరాలై దాడులకు దిగింది. మొత్తం 9 ప్రాంతాలపై బాంబులతో దాడుల చేసింది. ఈ ఆపరేషన్‌లో సైనిక వైమానిక, నావికా దళాలు పాల్గొన్నాయి. దాడుల్లో సుమారు 90 మంది మరణించినట్టు తెలుస్తోంది. జైష్ ఏ మహ్మద్, లష్కరే తయ్యబా ఉగ్రసంస్థలను టార్గెట్ చేసుకునేందుకు భారత్‌ ఈ స్థావరాలను ఎంచుకుంది. భారత చర్యలకు ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇజ్రాయెల్, రష్యా సహా అనేక దేశాలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ భారత్‌కు మద్దతు ప్రకటించాయి.


ఇవి కూడా చదవండి:

పాక్‌‌పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభం.. 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు

Security rill: రేపే సెక్యూరిటీ డ్రిల్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు

Anurag Thakur: సరిహద్దుల్లో పేట్రేగితే పాక్‌ను నామరూపాల్లేకుండా చేస్తాం

Read Latest and National News

Updated Date - May 07 , 2025 | 10:44 AM