Operation Sindoor: సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంట్ నిర్వహించాలి
ABN, Publish Date - Jun 04 , 2025 | 05:45 AM
ఆపరేషన్ సిందూర్ అంశంపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం జరుపాలని 16 విపక్ష పార్టీలు ప్రధాని మోదీకి లేఖ రాశాయి. ఈ లేఖకు కংగ్రెసు, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన, సీపీఎం తదితర పార్టీల నేతలు సంతకం చేశారు.
ప్రధానికి ఇండియా కూటమి నేతల లేఖ
న్యూఢిల్లీ, జూన్ 3: ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోదీకి విపక్ష ఇండియా కూటమిలోని 16 పార్టీలు లేఖ రాశాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో మంగళవారం ఆ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి జైరాం రమేష్, దీపేంద్ర హుడా (కాంగ్రెస్), ఓబ్రెయిన్(టీఎంసీ), రాంగోపాల్ యాదవ్(ఎస్పీ), మనోజ్ ఝా (ఆర్జేడీ), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ) తదితరులు హాజరయ్యారు. మోదీకి రాసిన లేఖపై సంతకాలు చేసినా ఎం.కరుణానిధి జయంతి నేపథ్యంలో డీఎంకే నేతలు ఈ భేటీలో పాల్గొనలేదు. లేఖపై రాహుల్, ప్రియాంక(కాంగ్రెస్), అఖిలేష్(ఎస్పీ), టీఆర్ బాలు(డీఎంకే), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), అరవింద్ సావంత్(శివసేన-యూబీటీ) తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), సీపీఎం, ఐయూఎంఎల్, సీపీఐ, ఆర్‌ఎస్పీ, విదుథలాయి చిరుథాయిగల్ కచ్చి(వీసీకే), కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీల నేతలు లేఖపై సంతకాలు చేశారని విపక్ష నేతలు చెప్పారు. ఈ సమావేశానికి డుమ్మా కొట్టిన ఆప్.. మోదీకి విడిగా లేఖ రాస్తామని తెలిపింది. ఇక, శరద్ పవార్ సారధ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ-ఎ్‌సపీ) ఈ భేటీకి గైర్హాజరైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 05:45 AM