Operation Sindoor: పాక్ కాల్పులు ప్రారంభించిన 3 నిమిషాల్లోనే.. భారత ఆర్మీ ఏం చేసిందంటే
ABN, Publish Date - May 20 , 2025 | 08:20 PM
పెహల్గాంలోని ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎదురుదాడి చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. అందుకు ప్రతిగా పాక్ కూడా ఎదురు కాల్పులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి పాల్పడింది.
పెహల్గాంలోని ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఎదురుదాడి చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ (Pakistan), పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది. అందుకు ప్రతిగా పాక్ కూడా ఎదురు కాల్పులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి పాల్పడింది. ఆ సమయంలో పూంచ్‌లోని నియంత్రణ రేఖపై ఉన్న ఎత్తైన ఆర్మీ పోస్ట్ (Army Post) వద్ద జరిగిన ఆసక్తికర ఘటన గురించి ఓ జాతీయ మీడియా తాజాగా బయటపెట్టింది (Operation Sindoor).
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఓ కొండపై ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు ఉన్నాయి. అక్కడి నుంచి మే 6వ తేదీ రాత్రి పూంచ్ పోస్ట్‌పై పాకిస్తాన్ సైన్యం రెండు మోర్టార్ బాంబులను పేల్చిందట. వెంటనే స్పందించిన భారత సైన్యం (Indian Army) కేవలం 3 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు చెందిన 13 బంకర్లను పేల్చి పారేసిందట. పది వేల అడుగుల ఎత్తులో ఉన్న పూంచ్ పోస్ట్‌లో జరిగిన ఆ దాడి సమయంలో భారత సైన్యం ఫిరంగి, భుజంపై అమర్చిన క్షిపణులు, మోర్టార్ కాల్పులతో తీవ్రంగా దాడి చేసిందట.
ముందుగా నిర్ణయించుకున్న పథకం ప్రకారం ఆ దాడి జరిగిందట. దాంతో పాకిస్థాన్ వైపు భారీ ప్రాణ నష్టం సంభవించిందట. మళ్లీ ఇలాంటి పని చేసే ముందు 100 సార్లు ఆలోచించే విధంగా పాకిస్థాన్ సైన్యానికి బుద్ధి చెప్పినట్టు ఓ కల్నల్ వ్యాఖ్యానించారు. మే 7వ తేదీన, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగింది. ఈ ఆపరేషన్‌లో 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను భారత సైన్యం నాశనం చేసింది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 20 , 2025 | 08:41 PM