Ola-Uber: ఓలా, ఉబర్‌కు ప్రభుత్వం నోటీసులు.. ఎలా వసూలు చేస్తారంటూ..
ABN, Publish Date - Jan 23 , 2025 | 04:45 PM
Cab Rates: యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ప్రముఖ సంస్థలు ఓలా, ఉబర్‌కు షాక్ తగిలింది. ఆ రెండు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఓలా, ఉబర్.. యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందించడంలో ఈ రెండు సంస్థలు బాగా పాపులర్ అయ్యాయి. నిల్చున్న చోటు నుంచే ఈ కంపెనీల యాప్స్‌లో క్యాబ్‌లు బుక్ చేసుకొని కావాలనుకున్న చోటుకు వెళ్లిపోవచ్చు. క్యాబ్స్‌తో పాటు ఆటో, బైక్ రైడ్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడంతో ఈ యాప్స్‌కు మరింత క్రేజ్ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ఓలా, ఉబర్ మీద కంప్లయింట్స్ ఎక్కువవుతున్నాయి. ఈ విషయం మీద కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ రెండు కంపెనీలకు షాక్ ఇచ్చింది.
జవాబు చెప్పాల్సిందే!
ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది కేంద్ర సర్కారు. ఇలాంటి యాప్‌లు ఫోన్ల ధరను బట్టి చార్జీలు వసూలు చేస్తున్నాయనే కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ను బట్టి కూడా రైడ్ చార్జీల్లో తేడాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ రేటును బట్టి రైడ్ మొదలయ్యేటప్పుడు ఒక ధర.. గమ్యస్థానానికి చేరాక మరో ధరను చూపించడం మీదా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ ఓలా, ఉబర్‌ను ఆదేశించింది కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ.
ఎందుకీ తేడా?
ఓలా, ఉబర్ మీద ఇతర ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఒకే సర్వీసుకు ఈ రెండు కంపెనీలు వేర్వేరు చార్జీలు వసూలు చేస్తున్నాయనే కంప్లయిట్స్ వినిపిస్తున్నాయి. దీని మీద కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ చర్యలు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఒకే సర్వీసుకు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారంటూ సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని రెండు సంస్థల్ని ఆదేశించింది. రేట్లలో తేడాలు ఉన్నట్లు క్లియర్‌గా అర్థమవుతోందని వినియోగదారుల రక్షణ సంస్థ పేర్కొంది. సర్వీసులు, చార్జీల విషయంలో పారదర్శకత, నిజాయితీ తీసుకురావడం మీద సరైన వివరణతో రావాలని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
కోహ్లీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jan 23 , 2025 | 04:46 PM