Granite Quarry Accident: గ్రానైట్ క్వారీని పరిశీలించిన ఒడిశా బృందం
ABN, Publish Date - Aug 05 , 2025 | 06:47 AM
బాపట్ల జిల్లా బల్లికురవ ప్రాంతంలోని వీర్లకొండవద్ద ఉన్న సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో బండరాయి పడి ఒడిశాకు చెందిన
ప్రమాదంపై ఏపీ ప్రభుత్వ స్పందన బాగుందని వ్యాఖ్య
బల్లికురవ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా బల్లికురవ ప్రాంతంలోని వీర్లకొండవద్ద ఉన్న సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో బండరాయి పడి ఒడిశాకు చెందిన ఆరుగురు కూలీలు మృతి చెందిన ఘటనపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. సోమవారం ఆ రాష్ట్ర లేబర్ జాయింట్ కమిషనర్ భగవణ మహాపాత్ర, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా లేబర్ జాయింట్ కమిషనర్ ప్రీతిష్ పాండా, లేబర్ కమిషనర్ కన్సల్టెంట్ బస్తాబంద్ ఆచార్య చీరాల ఆర్డీవోతో కలిసి ప్రమాదం జరిగిన క్వారీని పరిశీలించారు. ఆనంతరం నరసరావుపేట వెళ్లి అక్కడ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రమాదం జరిగిన వెంటనే బాగా స్పందిందని వ్యాఖ్యానించారు.
Updated Date - Aug 05 , 2025 | 06:47 AM