No Labels: సమోసా జిలేబిలపై లేబుళ్లు వేయాలనలేదు కేంద్రం
ABN, Publish Date - Jul 16 , 2025 | 05:18 AM
దేశంలో ప్రసిద్ధ చిరుతిళ్లయిన సమోసా, జిలేబీ వంటి ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుళ్లు పెట్టాలని చెప్పలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీధి వ్యాపారులు విక్రయించే...
న్యూఢిల్లీ, జూలై 15: దేశంలో ప్రసిద్ధ చిరుతిళ్లయిన సమోసా, జిలేబీ వంటి ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుళ్లు పెట్టాలని చెప్పలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీధి వ్యాపారులు విక్రయించే చిరుతిళ్లను లక్ష్యంగా చేసుకొని ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేదని మంగళవారం తెలిపింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించేలా ప్రజల్ని ప్రోత్సహించడానికే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, ఇతర కార్యాలయాల్లో ‘చక్కెర, నూనె బోర్డులు’ ఏర్పాటు చేయాలని, రోజువారీ తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వు, చక్కెర శాతం వంటి సమాచారాన్ని డిజిటల్ బోర్డుల్లో ప్రదర్శించాలని సూచించినట్లు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 16 , 2025 | 05:59 AM