ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dr Ramdas: నో డౌట్.. ఆ పార్టీకి నేనే శాశ్వత అధ్యక్షుడిని..

ABN, Publish Date - Apr 12 , 2025 | 12:11 PM

నో డౌట్.. ఆ పార్టీకి నేనే శాశ్వత అధ్యక్షుడిని.. అంటున్నారు డాక్టర్‌ రాందాస్‌. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను స్థాపించిన పార్టీకి ఇక తానే శాశ్వత అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు.

- పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌

చెన్నై: పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే)కి తానే శాశ్వత అధ్యక్షుడినని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆ పార్టీ వ్యవస్ధాపకుడు డాక్టర్‌ రాందాస్‌(Dr Ramdas) తేల్చి చెప్పారు. విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని తైలావనం గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాందాస్‌ ఈ మేరకు పునరుద్ఘాటించారు. పీఎంకే(PMK) అధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడు డాక్టర్‌ అన్బుమణి(Dr Anbumani)ని తొలగిస్తున్నట్లు రాందాస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: Mother Rescue Child: తల్లి ప్రేమకు నిదర్శనం ఈ వీడియో.. హ్యాట్సాఫ్ అమ్మ


ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను స్థాపించిన పార్టీకి ఇక తానే శాశ్వత అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఇదిలా ఉండగా తండ్రీకొడుకులకు నచ్చచెప్పి, ఇద్దరినీ కలపాలని పలువురు సీనియర్‌ రాజకీయ నేతలు ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే అందుకే రాందాస్‌ విముఖత చూపినట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి:

రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

ఒక్క క్లిక్‌తో స్థలాల సమస్త సమాచారం!

రైల్వే తీరుతో ప్రయాణికుల పరేషాన్‌

పాముల మధ్య ఘర్షణ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2025 | 12:23 PM