ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

New Income Tax Act: ఇక కొత్త ఆదాయ పన్ను చట్టం

ABN, Publish Date - Aug 12 , 2025 | 04:20 AM

ఆదాయ పన్ను ఐటీ చట్టం మరింత సులభతరంకానుంది. ఇందుకోసం ఆదాయ పన్ను బిల్లు..

  • బిల్లును ఆమోదించిన లోక్‌సభ

  • కొత్త చట్టంలో ఆలస్యంగా రిటర్న్‌లు ఫైల్‌ చేసినా రిఫండ్స్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆదాయ పన్ను (ఐటీ) చట్టం మరింత సులభతరంకానుంది. ఇందుకోసం ఆదాయ పన్ను బిల్లు, 2025 పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ సోమవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. పన్ను చెల్లింపుదారుల ందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ బిల్లును రూపొందించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈ బిల్లు ‘ఆదాయ పన్ను చట్టం, 2025’ పేరుతో అమల్లోకిరానుంది. ఈ బిల్లులోని ప్రధానాంశాలు ఏమిటంటే..

రిఫండ్స్‌పై ఊరట..

కొత్త ఐటీ చట్టంలో ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసే వారికి రిఫండ్స్‌ రద్దు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేకుండా ఆలస్యంగా రిటర్న్‌లు ఫైల్‌ చేసే వారికీ రిఫండ్స్‌ను అనుమతించబోతున్నారు. అనారోగ్యం, సాంకేతిక సమస్యలతో సకాలంలో ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయలేని వారికి ఇది పెద్ద ఊరట కానుంది. ఇక టీడీఎస్‌ చెల్లింపుదారులకూ కొత్త ఐటీ చట్టం ఊరట కల్పించనుంది. ఈ వివరాలు ఆలస్యంగా ఫైల్‌ చేసినా జరిమానాలు ఉండవు. అలాగే టీడీఎస్‌ చెల్లింపు భారం లేని పన్ను చెల్లింపుదారులు ముందుగానే ‘నిల్‌ టీడీఎస్‌’ సర్టిఫికెట్‌ పొందేందుకూ అవకాశం లభించనుంది.

కమ్యూటెడ్‌ పెన్షన్‌పై..

ప్రస్తుతం ఉద్యోగులకు కమ్యూటెడ్‌ పెన్షన్‌పై పన్ను మినహాయింపు సదుపాయం ఉంది. ఇప్పుడు ఈ ప్రయోజనాన్ని ఉద్యోగేతరులకూ విస్తరించబోతున్నారు. ఎల్‌ఐసీ పెన్షన్‌ ఫండ్‌ వంటి ప్రత్యేక ఫండ్స్‌ నుంచి ఒకేసారి ఏక మొత్తంలో పెన్షన్‌ అందుకునే వారికీ ఈ ప్రయోజనం లభిస్తుంది.

ప్రాపర్టీ ట్యాక్స్‌పై స్పష్టత

గృహ ఆస్తుల ఆదాయం పన్ను మదింపుపైనా కొత్త చట్టంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మునిసిపల్‌ ట్యాక్స్‌లు పోగా వచ్చే వార్షిక ఆదాయం నుంచి 30 శాతాన్ని స్టాండర్డ్‌ డిడక్షన్‌గా అనుమతిస్తారు. ఇల్లు కొనేందుకు, నిర్మించేందుకు లేదా మరమ్మతు చేయించేందుకు చేసిన అప్పులపై చెల్లించే వడ్డీకి కూడా గృహ యజమానులు ఈ ఆదాయం నుంచి డిడక్షన్‌ పొందవచ్చు. గృహాస్తి మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని మాత్రమే అద్దెకు ఇస్తే.. సముచిత లేదా వాస్తవ అద్దె ఆదాయం.. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే దాన్ని మాత్రమే గృహాస్తి ఆదాయంగా పరిగణిస్తారు. కాగా, కొత్త చట్టంలో ప్రస్తుత ఆదాయ శ్లాబులు యథాతథంగా ఉండనున్నాయి.

Updated Date - Aug 12 , 2025 | 04:20 AM