ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

FASTag New Policy: టోల్ పాస్.. కేంద్రం బంపరాఫర్. ఇక అన్ లిమిటెడ్ ఫ్రీ జర్నీ

ABN, Publish Date - May 25 , 2025 | 03:32 PM

ప్రయాణాల్లో తరచూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ లతో ఇబ్బంది పడుతున్నారా.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక బంపరాఫర్ తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఇక ఫ్రీగా..

FASTag New Policy

ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణాల్లో తరచూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ లతో ఇబ్బంది పడుతున్నారా.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక బంపరాఫర్ తీసుకొస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఏడాదంతా ప్రయాణానికి ఒకేసారి చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టగల కొత్త టోల్ పాలసీని అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉంది. ఈ ప్రతిపాదిత స్కీమ్ లక్ష్యం వాహన యజమానులకు సజావుగా, అంతరాయం లేని ప్రయాణాన్ని అందించడం, తరచుగా టోల్ టాప్-అప్‌ల అవసరాన్ని తొలగించడం, భారతదేశ జాతీయ రహదారి నెట్‌వర్క్ అంతటా ఒకే డ్రైవింగ్ అనుభవాన్ని అందించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఈ స్కీమ్ ముసాయిదా ప్రతిపాదనలో భాగంగా, వాహన యజమానులకు త్వరలో రూ.3,000 వార్షిక రుసుము చెల్లించే అవకాశం కలగొచ్చు. తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌వేలపై స్వేచ్ఛగా, పరిమితులు లేకుండా ప్రయాణించవచ్చు. కొత్తగా తీసుకురాబోతున్న ఈ స్కీమ్ లో రెండు చెల్లింపు విధానాల్ని తీసుకురాబోతున్నారు. మొదటిది వార్షిక పాస్, దీనికి ప్రతి సంవత్సరం రూ. 3,000 ఫ్లాట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది వినియోగదారులకు టోల్ రోడ్లపై అపరిమిత జర్నీని అందిస్తుంది. రెండవది దూరాన్ని బట్టి పాస్ తీసుకునే సౌలభ్యం. ఈ స్కీం కింద వినియోగదారులు 100 కిలోమీటర్లకు రూ. 50 ఫిక్స్డ్ అమౌంట్ చెల్లిస్తారు. దీనికి అదనపు డాక్యుమెంటేషన్ కూడా ఏమీ ఉండదు.


ఇవీ చదవండి:

Gold Rates on May 25: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 03:32 PM