Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియాపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించిన ఎన్‌సీడబ్ల్యూ
ABN, Publish Date - May 14 , 2025 | 03:45 PM
మధ్యప్రదేశ్ గిరజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా ఇటీవల ఒక కార్యక్రమంలో కల్నల్ సోఫియాపై చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తూ, మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరిస్తూ వచ్చిన కల్నల్ సోఫియా ఖురేషి (Colonel Sofiya Qureshi)పై అభ్యంతకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా ఖండించింది. సాయుధ బలగాల్లో పనిచేస్తున్న మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని పేర్కొంది.
Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్
మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా ఇటీవల ఒక కార్యక్రమంలో కల్నల్ సోఫియాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రి పేరును ఎన్‌సీడబ్ల్యూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వ్యక్తులు మహిళలను కించపరచేలా మాట్లాడటం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ విజయ్ రహాట్కర్ అన్నారు. ఇది సమాజంలోని మహిళల గౌరవాన్ని కించపరచడమే కాకుండా, దేశ భద్రతలో కీలక భూమిక పోషిస్తున్న మన ఆడకూతుళ్లను అవమానించడమే అవుతుందన్నారు. కల్నల్ సోఫియా ధైర్యసాహసాలు, అంకితభావం కలిగిన అధికారి అని, అటువంటి మహిళలను చూసి దేశం గర్విస్తోందని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ గిరజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా ఇటీవల ఒక కార్యక్రమంలో కల్నల్ సోఫియాపై చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తూ, మంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ''వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల నుదుట సిందూరాన్ని తుడిచేశారు. వాళ్ల (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదిరిని పంపించి గట్టి గుణపాఠం చెప్పాం'' అని విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. అయితే, ఆ తర్వాత తన వ్యాఖ్యలకు మంత్రి విజయ్ షా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖలు ఎవరినీ కించపరచేందుకు చేసినవి కావని, ఎవరినైనా నొప్పిస్తే ఒకటికి పదిసార్లు క్షమాపణ చెబుతానని అన్నారు.
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 14 , 2025 | 06:03 PM