Medical Miracle: మెడికల్ మెరాకిల్.. 24 గంటల్లో 200 సార్లు ఫిట్స్ వచ్చినా..
ABN, Publish Date - Jun 20 , 2025 | 07:13 PM
Medical Miracle: ఎక్కువ సార్లు ఫిట్స్ రావటం వల్ల బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు. డాక్టర్లు అతడ్ని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పిల్లాడు ‘ఫైర్స్’ అనే ఎపిలెప్సీకి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
రోజులో ఒకసారి ఫిట్స్ వస్తేనే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటిది ఒకే రోజులో 200 సార్లు ఫిట్స్ వస్తే ప్రాణాలు నిలబడటం కష్టమే. కానీ, 8 ఏళ్ల ఓ బాలుడు మాత్రం 200 సార్లు ఫిట్స్ వచ్చినా.. ప్రాణాలతో బయటపడ్డాడు. డాక్టర్లు సైతం అవాక్కయిపోయారు. డాక్టర్లను సైతం ఆశ్చర్యపర్చిన ఈ మెడికల్ మెరాకిల్ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన మాజ్ అన్సారీ అనే 8 ఏళ్ల పిల్లాడికి రెండు నెలల క్రితం జ్వరం వచ్చింది.
జ్వరంతో పాటు తరచుగా ఫిట్స్ కూడా వస్తుండటంతో... తల్లిదండ్రులు కేజే సౌమ్య హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు బాలుడ్ని తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఫిట్స్ రావటం ఎక్కువైంది. ఒకే రోజులో 200 సార్లు ఫిట్స్ వచ్చాయి. అయినా పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడికి చికిత్స చేస్తున్న డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అయితే, ఎక్కువ సార్లు ఫిట్స్ రావటం వల్ల బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు. డాక్టర్లు అతడ్ని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పిల్లాడు ‘ఫైర్స్’ అనే ఎపిలెప్సీకి సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. డాక్టర్ల బృందం బాలుడ్ని పీఐసీయూలో ఉంచి రెండు నెలలుగా ప్రత్యేక చికిత్స అందిస్తోంది. రెండు నెలల డాక్టర్ల కష్టం ఫలించింది. పిల్లాడు ఆరోగ్యం మెరుగుపడింది. కోమాలోంచి బయటపడ్డాడు.
ఫైర్స్ అంటే ఏమిటి?
ఫెబ్రైల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఎపిలెప్సీ సిండ్రోమ్‌ను షార్ట్ కట్‌లో ఫైర్స్ అంటారు. ఈ ఫైర్స్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా 200 మాత్రమే ఉన్నాయి. ఫెబ్రైల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏకధాటిగా ఫిట్స్ వస్తూనే ఉంటాయి. కేజే సౌమ్య హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన డాక్టర్ మనీషా బోబాడే మాట్లాడుతూ.. ‘ప్రతీ ఏటా దేశంలో అరుదైన రోగాలు, కండీషన్లు పెరుగుతూ పోతున్నాయి. అలాంటి వాటిని గుర్తించటమే కాదు.. చికిత్స అందించటం కూడా చాలా కష్టం. రేర్ కండీషన్స్‌లో ఫైర్స్ కూడా ఒకటి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
స్పెషల్ ట్రైన్లో పొట్టుపొట్టు కొట్టుకున్న అమ్మాయిలు
Updated Date - Jun 20 , 2025 | 07:34 PM