Madhyapradesh: నేరాలను అరికట్టాల్సిన బాధ్యత కేవలం పోలీసులపై పెట్టడం సరికాదు: మధ్యప్రదేశ్ డీజీపీ
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:16 PM
సమాజంలో నేరాలను అరికట్టాల్సిన బాధ్యతను కేవలం పోలీసులపై మాత్రమే పెట్టడం సబబు కాదని మధ్యప్రదేశ్ డీజీపీ అన్నారు. అశ్లీల కంటెంట్ సులువుగా లభిస్తుండటం, నైతిక విలువల పతనం వంటివన్నీ నేరాల పెరుగుదలకు కారణమని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో నేరాలు అత్యాచారాలు ఎక్కువవడానికి సెల్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ వాడకం పెరగడం, నైతికత తగ్గడమేనని మధ్యప్రదేశ్ డీజీపీ కైలాశ్ మక్వానా స్పష్టం చేశారు. పోలీసుల ఒంటరి ప్రయత్నంతో ఈ నేరాలకు అడ్డుకట్ట పడదని చెప్పారు. ఉజ్జైన్‌లో డివిజనల్ రివ్యూ మీటింగ్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో జనాలకు అశ్లీల కంటెంట్ సులువుగా లభిస్తోందని అన్నారు.
‘సమాజంలో నేరాలు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు కూడా కారణమే. అశ్లీల కంటెంట్, ఆల్కహాల్, సమాజంలో నైతిక విలువలు తగ్గడం వంటివన్నీ ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి’ అని ఆయన అన్నారు. సులువుగా లభిస్తున్న అశ్లీల కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందని చెప్పారు.
చాలా చిన్న వయసు నుంచే మనసులు కలుషితం అవుతున్నాయని అన్నారు. కాబట్టి నేరాలను అరికట్టడం పోలీసుల బాధ్యత మాత్రమే అని అనడం సరికాదని అభిప్రాయపడ్డారు. కుటుంబాల్లో కూడా నైతిక విలువలు తగ్గిపోతున్నాయని, పెద్దలు, టీచర్ల మాట పిల్లలు వినే రోజులు పోయాయని చెప్పారు.
‘కుటుంబాల్లో కూడా పెడ పోకడలు కనిపిస్తున్నాయి. ఒకరి విషయంలో మరొకరు జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు పెద్దలు, టీచర్ల మాటలను పిల్లలు వినే వారు. పరువు మర్యాద అన్న భావనలు ఉండేవి. ఇప్పుడు ఆ సరిహద్దులు చెరిగిపోయాయి’ అని కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో భార్యాభర్తల ఫైట్.. మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడంతో.
ఏడేళ్లుగా యాంటీ ఏజింగ్ ఔషధాలు.. నటి షఫాలీ మృతికి ఇవే కారణమా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 12:28 PM