Share News

Shefali Jariwala: ఏడేళ్లుగా యాంటీ ఏజింగ్ ఔషధాలు.. నటి షఫాలీ మృతికి ఇవే కారణమా

ABN , Publish Date - Jun 29 , 2025 | 09:56 AM

వయసు కనబడకుండా ఉండేందుకు వాడే యాంటీ ఏజింగ్ మందులతోనే బాలీవుడ్ నటి షఫాలీ గుండెపోటు బారిన పడి మరణించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

Shefali Jariwala: ఏడేళ్లుగా యాంటీ ఏజింగ్ ఔషధాలు.. నటి షఫాలీ మృతికి ఇవే కారణమా
Shefali Jariwala death 2025

ఇంటర్నెట్ డెస్క్: వయసు ఛాయలు కనిపించకుండా ఉండేందుకు వినియోగిస్తున్న యాంటీ ఏజింగ్ మందులతో బాలీవుడ్ నటి షఫాలీ జరీవాలాకు గుండె పోటు వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడెనిమిదేళ్లుగా ఆమె ఈ మందులు వాడుతున్నట్టు గుర్తించారని సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం, నటి మృతికి సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రశ్నించారు. ప్రాథమిక ఫారెన్సిక్ ఆధారాలను కూడా సేకరించారు.

‘షఫాలీ యాంటీ ఏజింగ్ ఔషధాలను గత ఏడెనిమిదేళ్లుగా వాడుతున్నారు. చాలా కాలం క్రితం వైద్యులు ఆమెకు ఈ ఔషధాలు సూచించారు. నాటి నుంచీ నెలనెలా ఈ మందులు తీసుకుంటున్నారు. ఇక ఘటన జరిగిన రోజున ఆమె ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె ఆ రోజు ఉపవాసం ఉన్నారు. అయినా కానీ ఆ మధ్యాహ్నం ఆమె యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారు. ఈ మందులే ఆమెకు గుండె పోటు రావడానికి ప్రధాన కారణం అయి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలింది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


జూన్ 27న రాత్రి 10-11 గంటల మధ్య ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా విషమించినట్టు తెలుస్తోంది. ఆ తరువాత కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయారు. వెంటనే షఫాలీని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఇంట్లో షఫాలీ భర్త పరాగ్‌తో పాటు తల్లి, ఇతర వ్యక్తులు ఉన్నారు. కాగా, శనివారం కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో షఫాలీ అంత్యక్రియలు నిర్వహించారు.


2002 నాటి ‘కాంటా లగా’ పాటలో నటించిన షఫాలీ ఒక్కసారిగా దేశమంతటా పాప్యులర్ అయిన విషయం తెలిసిందే. సల్మాన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో 2004లో విడుదలైన ‘ముఝ్ సే షాదీ కరోగీ’ సినిమాలో కూడా షఫాలీ తళుక్కుమన్నారు. బిగ్ బాస్ 13 సీజన్‌లో కూడా పాల్గొని మరోసారి జనాలకు చేరువయ్యారు. ఇక షఫాలీ హఠాన్మరణంపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కశ్మీర్‌ రిసార్ట్‌లో ఎలుగుబంటి కలకలం

పాక్‌కు కీలక సమాచారం లీక్.. నేవీ ప్రధాన కార్యాలయం ఉద్యోగి అరెస్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 10:08 AM