ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi Foreign Tours: 33 దేశాలు.. 362 కోట్లు!

ABN, Publish Date - Jul 26 , 2025 | 03:13 AM

ప్రధాని మోదీ 2021-25 మధ్య 33 దేశాల్లో పర్యటించారని.. ఆయా దేశాల్లో పర్యటనలకు సంబంధించి..

  • 2021-25 మధ్య ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చు ఇది

న్యూఢిల్లీ, జూలై 25: ప్రధాని మోదీ 2021-25 మధ్య 33 దేశాల్లో పర్యటించారని.. ఆయా దేశాల్లో పర్యటనలకు సంబంధించి రూ.362 కోట్లు ఖర్చయిందని కేంద్రం పేర్కొంది. గురువారం రాజ్యసభలో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ ఆయా పర్యటనలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ జాబితాలో ప్రస్తుత బ్రిటన్‌, మాల్దీవుల పర్యటనకు సంబంధించిన ఖర్చులను చేర్చలేదన్నారు. ఈ నెల మొదట్లో వెళ్లిన ఐదు దేశాల పర్యటన సహా మొత్తం ఐదేళ్లలో ప్రధాని 33 దేశాల్లో పర్యటించారని తెలిపారు. అయితే కెనడా, బ్రెజిల్‌, మారిషస్‌ దేశాల పర్యటన బిల్లులను పూర్తిగా చెల్లించనందున వాటిని లెక్కల్లో చేర్చలేదని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌, అమెరికా, ఏప్రిల్‌లో థాయ్‌లాండ్‌, శ్రీలంక, సౌదీ అరేబియాలలో పర్యటించారని.. వీటి ఖర్చు రూ.67కోట్లు అయిందన్నారు. వీటిలో ఫ్రాన్స్‌, అమెరికాలలో పర్యటించినప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందని.. ఇది రూ.25.59 కోట్లుగా ఉందన్నారు. ఫిబ్రవరి 13న ప్రధాని అమెరికాలో పర్యటించారని.. ఆ ఒక్క రోజే రూ.16.54 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 03:13 AM