Honeymoon Murder: హత్య తర్వాత ఇండోర్‌లోనే దాక్కున్న సోనమ్.. అగ్రిమెంట్ కూడా చేసుకుని..
ABN, Publish Date - Jun 14 , 2025 | 04:06 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారం రోజుల్లోనే భర్త రాజా రఘవంశీని హత్య చేయించిన సోనమ్‌కు సంబంధించిన ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తూ విస్మయం కలిగిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు (Meghalaya Murder case) ఓ కొలిక్కి వచ్చింది. కొత్తగా పెళ్లైన వారం రోజుల్లోనే భర్త రాజా రఘవంశీని హత్య చేయించిన సోనమ్‌కు సంబంధించిన ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తూ విస్మయం కలిగిస్తున్నాయి. తన భర్త హత్యలో తన ప్రమేయం ఉన్నట్టు సోనమ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉంది. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది (Crime News).
భర్త రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత సోనమ్ ఇండోర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఆశ్రయం పొందిందని పోలీసు వర్గాలు తెలిపాయి. భర్తను హత్య చేసిన కొందరు దుండగులు తనను కిడ్నాప్ చేసినట్టు బయటి ప్రపంచానికి చెప్పాలని సోనమ్ ప్లాన్ చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లోని ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని అక్కడ సోనమ్ దాక్కుంది. మేఘాలయలో రాజాపై కత్తితో దాడి చేసిన మొదటి వ్యక్తి విశాల్ సింగ్ చౌహాన్ ఈ ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నాడు. హత్య జరిగిన వారం రోజుల తర్వాత మే 30వ తేదీన ఇండోర్‌లో తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఆ ఫ్లాట్‌ను విశాల్ అద్దెకు తీసుకుని అందులో సోనమ్‌ను ఉంచాడు.
తాను ఇంటీరియర్ డిజైనర్‌నని, ఉండడానికి ఫ్లాట్ కోసం చూస్తున్నానని విశాల్ యజమానికి చెప్పాడు. అడ్వాన్స్‌గా రూ.16000 కూడా చెల్లించాడు. పోలీస్ వెరిఫికేషన్ కూడా జరిగింది. చివరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులందరినీ అరెస్ట్ చేశారు. కాగా, ఇండోర్‌కు చెందిన సోనమ్, రాజా రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. రాజా, సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వారి ఆచూకీ దొరకలేదు. చివరకు జూన్ రెండో తేదీన రాజా రఘవంశీ మృతదేహం దొరికింది. గాజీపూర్‌లో సోనమ్ ఆచూకీ లభ్యమైంది.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News
Updated Date - Jun 14 , 2025 | 04:07 PM